అల్లు శిరీష్ – విఐ ఆనంద్ సినిమా ప్రారంభం

Allu Sirish VI Anand next project shooting started

శ్రీరస్తు శుభమస్తు వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత అల్లు శిరీష్ హీరోగా , ఎక్కడికి పోతావు చిన్నవాడ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ సురభి, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 సినిమా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, నిర్మాత చక్రి తండ్రి శంకర్ చిగురుపాటి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు విఐ ఆనంద్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు.

దర్శకుడు విఐ ఆనంద్ మాట్లాడుతూ – అల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురు పాటి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.5 చిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఫిలినంగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ గా సాగే సైంటిఫిక్ ఫిక్షన్ స్టోరీ. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాం. ఇందులో ప్రతీ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.

 హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ – విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న చిత్ర పూజా కార్యక్రమాలు ఫిలింనగర్ దైవసన్నిధానంలో చేశాం. నాన్న క్లాప్ కొట్టారు. ఈనెలాఖరులో షూటింగ్ ప్రారంభిస్తున్నాం. రొమాంటిక్ థ్రిల్లర్ కథ ఇది. సైన్స్ ఫిక్షన్ కూడా ఉంటుంది. మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. మలయాళంలో నేను నటించిన 1971, సూపర్ హిట్ దృశ్యం లాంటి చిత్రాలకు పని చేసిన సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. అలాగే మణిశర్మగారు సంగీతం అందిస్తున్నారు. మంచి టీం కుదిరింది. అన్ని వర్గాల్ని మెప్పించే కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. అని అన్నారు.

మణిశర్మ, అబ్బూరి రవి, ఛోటా కె ప్రసాద్, సుజిత్, నాగేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. సతీష్ వేగేశ్న, రాజేష్ దండ సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.