వ్యాపారాన్ని దెబ్బతీస్తున్న ‘అమెజాన్ ప్రైమ్’

Amazon Prime Video, Netflix, Hotstar in swing now TV Networks Should Seriously Worry About

Amazon Prime Video, Netflix, Hotstar in swing now TV Networks Should Seriously Worry About

సినిమాల విడుదల తర్వాత వాటి భవితవ్యాన్ని శాసించే శాటిలైట్ ఛానల్స్కి గట్టి ఎదురుదెబ్బ తగలడం మొదలైంది. ఇన్ని రోజులు సినిమా బాక్సాఫీస్‌లో రాబట్టిన కలెక్షన్లపై అంచనావేసి శాటిలైట్ రైట్స్ తీసుకొనే ఛానళ్ళకు గట్టి పోటీ తగులుతోంది.

డిజిటల్ రైట్స్ పేరుతో అమెజాన్ ప్రైమ్‌లాంటి సంస్థలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని విస్తరిస్తుండడంతో శాటిలైట్ ఛానల్స్ గగ్గోలు పెడుతున్నాయి. ఒక‌రు లాభ‌ప‌డుతున్నారంటే దాని అర్థం త‌మ‌కు తెలియ‌కుండానే మ‌రొక‌రు న‌ష్ట‌పోతున్నార‌ని. ఈ రెండూ బేరీజు వేస్తేనే వ్యాపారం. ఇప్పుడు కూడా నిర్మాత‌ల‌కు కొన్ని ఆన్ లైన్ ఛానెల్స్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్నాయి. వీటి వ‌ల్ల నిర్మాత‌ల పంట పండుతుంది. కానీ ఛానెల్స్ కొంప మునుగుతుంది.

ఓ సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతాకాదు. కోట్లల్లోనే వాటి లెక్కలుంటాయి. స్టార్ హీరో సినిమాలకు ఉన్నంత డిమాండ్ మరి దేనికీ ఉండడదు. స్టరా్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు కోట్లకు కోట్లు ఇచ్చి సొంతం చేసుకుంటున్నాయి శాటిలైట్ ఛానెల్స్. అయితే సినిమా ప్రసరం చేసేటప్పుడు వచ్చే యాడ్స్ రూపంలో ఆ డబ్బులను తిరిగి సంపాదించుకుంటాయి ఛానెల్స్. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా శాటిలైట్ హ‌క్కుల‌కు పోటీగా డిజిట‌ల్ రైట్స్ రంగంలోకి దిగాయి.

డిజిట‌ల్ రైట్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు వాటిపై పూర్తి అవగాహన వచ్చేస్తోంది.డిజిటల్ రైట్స్‌పై ప్రచారం ఎక్కువ అవడంతో నిర్మాత‌ల‌కు వ‌రంగా మార‌ుతోంది. ఇన్నాళ్లూ శాటిలైట్‌తో పాటే డిజిట‌ల్ రైట్స్ కూడా క‌లిపి ఒక్కిరికే ఇచ్చేవాళ్లు నిర్మాత‌లు.  కానీ ఇప్పుడు హాట్ స్టార్, అమేజాన్ లాంటి సంస్థ‌లు డిజిట‌ల్ రైట్స్‌ని భారీ రేట్‌కు తీసుకుంటున్నాయి.

ఈ మార్పుతో సినిమా నిర్మాత‌లు ఛానెల్స్‌కు కేవ‌లం శాటిలైట్ హక్కులు మాత్రమే అమ్మి ప్ర‌త్యేకంగా డిజిట‌ల్ రైట్స్ ను ఇత‌ర వీడియో సంస్థ‌ల‌కు అమ్మేస్తున్నారు. ఈ మధ్య విడుదలై భఆరీ హిట్ అయిన ఘాజీ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్‌ని అమెజాన్  మూడు భాష‌ల్లో క‌లిపి 15 కోట్ల‌కు సొంతం చేసుకుందట. దీనివ‌ల్ల నిర్మాతలకు లాభం వస్తుండగా ఛానెల్స్‌కే పరోక్షంగా దెబ్బపడుతోంది. లేటెస్ట్‌గా విన్నర్, మిస్టర్ చిత్రాల్ని అమెజాన్ దాదాపు ఆరు కోట్లకు డీల్ కుదుర్చుకున్నారట.

ఒకవేళ ఇదేగనక కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో నెమ్మదిగా శాటిలైట్ ఛానల్స్‌కు కష్టకాలం తప్పేటట్లుగా లేదనిపిస్తోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.