టార్గెట్ 2019: కమ్యూనిస్ట్ కంచుకోటలో కమలవికాసం కోసం యత్నాలు

Amit Shah kicks off Mission Bengal campaign for 2019 general election from Naxalbari1

Amit Shah kicks off Mission Bengal campaign for 2019 general election from Naxalbari1

ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంపై ద‌‌ృష్టిపెడుతూ అధికారాన్ని కైవసం చేసుకొనే పనిలో బిజీగా ఉంటున్నారు కాషాయ దళాధిపతి అమిత్ షా. ఇప్పటికే దేశంలో కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌‌లో తన ప్రణాళికలతో అధికారాన్ని సాధించిపెట్టిన అమిత్ షా ఇప్పుడు బెంగాల్‌పై ద‌ృష్టి కేంద్రీకరించారు. పార్టీ బలహీనంగా ఉన్న బెంగాల్‌లో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఆచరణలో పెడుతున్నారు. అందులోభాగంగా మిషన్ బెంగాల్ కార్యక్రమాన్ని వ్యూహాత్మకంగా నక్సల్‌బరి గ్రామం నుంచి అమిత్ షా ప్రారంభించారు.

ఒక్కొక్కరాష్ట్రంలో ఒక్కొక్క ప్రణాళికతో ముందుకెళ్తున్న అమిత్ షా బెంగాల్‌లో ఇంటింటికి బీజేపీ అంటూ బెంగాల్‌లో సమర శంఖం పూరించారు. అందునా 50ఏళ్ల క్రితం మావోయిస్ట్ ఉద్యమం పుట్టి దేశ వ్యాప్తంగా విస్తరించి కమ్యూనిస్ట్ ఉద్యమానికి బీజాలు పడ్డ ఈ ప్రాంతంలో బీజేపీ విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అంతేగాక నక్సల్ బరి గ్రామంలోని పేదలతో కలిసి అమిత్ షా సహపంక్తి భోజనాలు చేశారు.

Amit Shah kicks off Mission Bengal campaign for 2019 general election from Naxalbari

విమర్శల రాజకీయాలను దిల్లీ ప్రజలు తిరస్కరించారు

మోదీ పాలనకు దిల్లీ ప్రజలు పట్టం కట్టారని, రెండేళ్ల ఆప్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని అమిత్‌ షా అన్నారు. ఈవీఎంల వల్లే ఓడిపోయామని ఆప్‌ చేస్తున్న వ్యాఖ్యలను అమిత్‌ షా ఖండించారు. 2015 ఎన్నికల్లో ఈవీఎంల వల్ల అధికారంలోకి వచ్చిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌… ఇప్పుడు ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు.

విమర్శల రాజకీయాలను దిల్లీ ప్రజలు తిరస్కరించారని.. విమర్శలతో ఆప్‌ తన గొయ్యి తానే తవ్వుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం పని చేసే ప్రభుత్వమని దిల్లీ ప్రజలు నిర్ధరించారని పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.