నమ్మలేని నిజాలు ‘కావాలనే’ బయట పెట్టారా?? అసలేం జరిగింది??

an-unreliable-twist-in-beautician-sirisha-and-kukunurpally-si-prabhakar-reddy-suicides

ఉదయం నుండి వెలుగులోకి వచ్చిన రెండు ఆత్మహత్యల కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న బ్యూటీషియన్ శిరీషకు కుకునూర్‌పల్లి పోలీస్’స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి కేసుకి లింక్ ఉందని తేల్చారు. దీంతో వెలుగులోకి వచ్చిన రెండు ఆత్మహత్యలకు సంబంధించి ఒక స్పష్టతకు వస్తున్నారు పోలీసులు. అయితే పోలీసులు చెబుతున్నదానికి ఈరెండు ఆత్మహత్యలకు నిజంగానే లింక్‌ ఉందా లేక రెండు కేసులను ముడిపెట్టి ఉన్నతాధికారులపై ఎలాంటి ఆరోపణలు బయటికి రాకుండా చూసే కార్యక్రమంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

an-unreliable-twist-in-beautician-sirisha-and-kukunurpally-si-prabhakar-reddy-suicides

శ్రీకృష్ణానగర్‌లో నివసించే శిరీష(28) ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్‌ఆర్‌గా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేస్తున్న పోలీసులు ఆర్జే ఫోటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌ , శ్రావణ్‌లను విచారిస్తున్న పోలీసులకు శిరీష రాసిన సుసైడ్ నోట్ దొరికిందని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులోనూ అంతా ఉన్నతాధికారుల ఒత్తిళ్ళు భరించలేకే చనిపోయాడని అందరూ అనుకుంటున్న సమయంలో  మరో కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు పోలీసులు. హైదరాబాద్‌ ఫిల్మ్‌‌నగర్‌లో బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్‌ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మద్యం మత్తులో శిరీషపై ప్రభాకర్‌ రెడ్డి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత కొంతకాలంగా ప్రభాకర్‌రెడ్డికి శిరీష పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలిందనే టాక్ బయటికి పొక్కేలా చేశారు పోలీసులు. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్‌ఐ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నారనే ప్రాథమిక అంచనాకు వస్తున్నారు పోలీసులు.

సోమవారం రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో ఫోటో స్టూడియో యజమాని రాజీవ్, అతని ఫ్రెండ్ శ్రావణ్, చనిపోయిన శిరీషలు ముగ్గురు కలిసి షామీర్‌పేటకు వెళ్ళి అక్కడినుండి కుకునూర్‌పల్లికి వెళ్ళి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని కలిసారని, ముగ్గురికి వివాదాలు ఉన్నాయని, వీరి మధ్య మంగళవారం తెల్లవారుజామున రెండున్నర వరకూ పంచాయితీ కొనసాగినట్లు తెలుస్తోంది.  ఆ తర్వాత అందరూ కలిసి మందుతాగిన తర్వాత మద్యం మత్తులో ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి శిరీషపై లైంగికంగా దాడిచేసి రేప్ చేశాడని ఆరోపణలను బయటికి తీసుకొచ్చారు పోలీసులు.

ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రేప్ జరిగిన తర్వాత మనస్తాపానికి గురైన శిరీష ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నప్పటికీ , శిరీష ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయన తర్వాత రాజీవ్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముందుగా ఆమె శరీరాన్ని ఎందుకు క్రిందికి దింపాడు? ఒకవేళ దింపినప్పటికీ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత అయినా శిరీష భర్తకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు?? అంతేగాక  రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే  చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని మొదటిసారి చెప్పిన రాజీవ్, రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మొత్తానికి పది నెలల వ్యవధిలోనే ఒకే పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ కేసు విచారణలో కొత్త కోణాన్ని వెలికితీసారని చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఎస్ఐ ప్రబాకర్‌రెడ్డి రాసిన మూడు పేజీల సుసైడ్ నోట్ బహిర్గతం అయితే కానీ ఈ కేసులో అసలు నిజాలు వెలుగుచూస్తాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.