అనసూయ కారుకు యాక్సిడెంట్

Anchor Anasuya met with an Car Accident in Ananthapuram District

Anchor Anasuya met with an Car Accident in Ananthapuram District

బుల్లితెర యాంకర్, ఐటం సాంగ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న అనసూయ కారుకు అనంతపురం జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. అనంతపురం జిల్లాలోని పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో జాతీయ రహదారిపై అనసూయ కారును మరో కారు ఢీకొంది.ఈ ఘటనలో అనసూయ తలకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదం అయిన కారును ఘటనా స్థలంలోనే వదిలి, వేరొక కారులో అనసూయ రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. స్వల్పగాయాలైన అనసూయను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.