యాక్సిడెంట్‌లో మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మ‌ృతి

Andhra Minister Narayana Son Nishith and his friend dies after his Benz rams into Metro Pillar

Andhra Minister Narayana Son Nishith and his friend dies after his Benz rams into Metro Pillar

హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మరణించాడు. ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిషిత్  బెంజ్ కారులో వెళ్తుండగా అదుపు తప్పి జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36 లో మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన ఇద్దరిని స్థానికులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తీసివేశారు. యాక్సిడెంట్‌లో చనిపోయింది మంత్రి కుమారుడనే విషయాన్ని పోలీసులు వచ్చే వరకు తెలియలేదు.

దీంతో జూబ్లీహిల్స్‌లోని మంత్రి నారాయణ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ కుమారుడు నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఎవరు నడుపుతున్నారనేది స్పష్టంగా తెలియలేదు. రేపు నెల్లూరులో నిశిత్‌ అంత్యక్రియలు జరగనున్నాయి.

మరోవైపు ఈ విషాద వార్త తెలుసుకున్న నారాయణ వియ్యంకుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు  హైదరాబాద్‌ బయల్దేరారు. ప్రస్తుతం లండన్‌లో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ ఈ రోజు రాత్రికి నేరుగా నెల్లూరు చేరుకునే అవకాశ ఉంది. ప్రతిపక్షనేత జగన్, మంత్రి నారా లోకేశ్‌ నిషిత్‌ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.