ఆందోళనల మధ్యే జీఎస్టీ బిల్లుకి ఆమోదం

Andhra Pradesh Assembly passes GST Bill despite the opposition protest

Andhra Pradesh Assembly passes GST Bill despite the opposition protest

దేశంలో కేంద్రం త్వరలో తీసుకురానున్న వస్తు సేవల పన్ను బిల్లు (జీఎస్టీ)కి ఒక్కొక్క రాష్ట్రం ఆమోదం తెలుపుతోంది. ఇటీవల ప్రత్యేకంగా సమావేశమై జీఎస్టీ బిల్లుకు తెలంగాణా అసెంబ్లీ ఆమోదం తెలిపితే ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనసభలో జీఎస్టీ బిల్లును ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టారు.

మరోవైపు రైతు సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో దద్ధరిల్లింది. సభ ప్రారంభం కాగానే రైతు సమస్యలపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం చుట్టు ముట్టి నిరసన తెలిపారు. వెంటనే రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఒకవైపు ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగుతుండగానే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సభలో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు సమస్యలపై చర్చించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉందని అన్నారు మంత్రి యనమల. ఈ బిల్లు వల్ల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.  ఒకే దేశం…ఒకే పన్ను విధానం వల్ల ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవాత్మక సంస్కరణ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కోంటున్నారని, పండించిన పంటకు గిట్టుబాటు దరలు లేఖ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం యొక్క ఏ ఒక్క సంక్షేమ పధకం ప్రజలకు ఉపయోగపడట్లేదని, అంతేగాక చంద్రబాబు టీడీపీ మ్యానిపెస్టోలో పెట్టిన 5000కోట్ల ధరల స్థిరీకరణ నిధి జాడే ఏమాత్రం లేదని దుయ్యబట్టారు శ్రీకాంత్ రెడ్డి.

జీఎస్టీ బిల్లు ఆమోదం అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అంతకు ముందు దేవినేని నెహ్రు, ఆరేటి కోటయ్య, రుక్మిణిదేవి, నారాయణరెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.