రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు

andhra pradesh budget presented by finance minister yanamala ramakrishnudu

 • ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ రూ 1,56,999 కోట్లు 

అమరావతి: “రాష్ట్ర రాజధాని కోసం భూసేకరణ పద్ధతిలో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. ఏడాది కాలంలోనే ఈ భూముల్లో తాత్కాలిక సచావాలయ సముదాయాన్ని పూర్తి చేసుకోగలిగాం. కేవలం 192 రోజుల రికార్డు వ్యవధిలోనే నూతన శాసనసభా భవనాన్ని నిర్మించుకోగలిగామని“ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2017-18 సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది తొమ్మిదోసారి.

విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ముందుంచుకున్న కర్తవ్యాలను ప్రతిబింబిస్తుందని యనమల పేర్కొన్నారు. సమర్ధుడైన చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన తెలిపారు. చారిత్రక నగరమైన అమరావతికి దాదాపు 2000 ఏళ్ల తర్వాత శాసనాధికారం తిరిగి సంప్రాప్తించిన సందర్భంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల అన్నారు.

andhra pradesh budget presented by finance minister yanamala ramakrishnudu

రాష్ట్ర విభజనానంతరం ఎన్నో పెనుసవాళ్లు, ముఖ్యంగా, భారీ రెవెన్యూలోటు వంటి వాటిని తట్టుకొని కొత్త రాష్ట్ర పరిపాలనతో గొప్ప పరివర్తన తీసుకువచ్చి, గత రెండున్న సంవత్సరాల కాలంలో గొప్ప పురోగతి సాధించామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర స్థల ఉత్పత్తి పెరుగుదలతతో మనం దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం.

కేవలం ఒక ఏడాది రికార్డు వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేసుకోవడమే కాక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలు పెట్టే దిశగా ముందుకు పోగలుగుతున్నామని తెలిపారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్ధిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగామని, దీనికి తగిన చట్టబద్ధత సాధించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆర్ధిక మంత్రి యనమల పేర్కొన్నారు. 2017-18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,56,999 కోట్లు అని యనమల వెల్లడించారు.

2017-18 బడ్జెట్ ముఖ్యాంశాలు

 • బడ్జెట్‌ మొత్తం: రూ. 1,56,999 కోట్లు
 • రెవెన్యూ వ్యయం- రూ. 1,25,912 కోట్లు
 • క్యాపిటల్ వ్యయం- రూ. 31,087 కోట్లు
 •  ఆర్థికలోటు- రూ. 23,054 కోట్లు
 • రెవెన్యూలోటు- రూ. 416 కోట్లు

కేటాయింపులు

 • హోంశాఖ  రూ. 5,221 కోట్లు
 • రోడ్లు, భవనాల శాఖ రూ. 4,041 కోట్లు
 • నిరుద్యోగ భృతి  రూ. 500 కోట్లు
 • శాప్‌  రూ. 195 కోట్లు
 • విద్యుత్‌శాఖ రూ. 4,311 కోట్లు
 • రాజధాని ప్రాంత అభివృద్ధికి రూ. 1,061 కోట్లు
 • మున్సిపల్‌ శాఖ రూ. 5,207 కోట్లు
 • స్కిల్‌ డెవలప్మెంట్ డెవలప్‌మెంట్‌ రూ. 398 కోట్లు
 • జలవనరుల శాఖ రూ. 12,770 కోట్లు
 • ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ రూ. 7,021 కోట్లు
 • ఉన్నత విద్యకు రూ. 3,513 కోట్లు
 • పాఠశాల విద్యకు రూ. 17,197 కోట్లు
 • డ్వాక్రా సంఘాలకు రుణాలు రూ. 1,600 కోట్లు
 • పెన్షన్లు రూ. 4376 కోట్లు
 • ఎన్టీఆర్‌ సుజల స్రవంతికి రూ.100 కోట్లు
 • పంచాయతీరాజ్‌శాఖ రూ. 6,562 కోట్లు
 • గృహ నిర్మాణశాఖ రూ. 1,457 కోట్లు
 • పౌరసరఫరాలశాఖ రూ. 2,800 కోట్లు
 • ఎన్టీఆర్‌ క్యాంటీన్ల పథకం రూ. 200 కోట్లు
 • ఎల్‌పీజీ కనెక్షన్ల కోసం రూ. 350 కోట్లు
 • ఎన్టీఆర్‌ వైద్య సేవ రూ. 1,000 కోట్లు
 • గ్రామీణ రహదారులు రూ. 262 కోట్లు
 • రైతు రుణమాఫీకి రూ. 3,600 కోట్లు
 • మహిళా సాధికార సంస్థకు రూ. 400 కోట్లు
 • స్త్రీ, శిశువు, వికలాంగులు, సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి రూ. 1,773 కోట్లు
 • దివ్యాంగులను పెళ్లిచేసుకుంటే ప్రోత్సాహం రూ. 50వేల నుంచి లక్షకు పెంపు
 • వికలాంగుల సంక్షేమానికి రూ. 89 కోట్లు
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు
 • కాపు కార్పొరేషన్‌కు రూ. 1,000 కోట్లు
 • రాష్ట్ర క్రైస్థవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు
 • మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌసమ్‌లకు రూ. 24 కోట్లు
 • వక్ఫ్‌ సర్వే కమిషన్‌కు రూ. 50 కోట్లు
 • జెరూసెలెం యాత్రికులకు సాయం రూ. 20 వేల నుంచి 40 వేలకు పెంపు
 • కొత్త చర్చిల నిర్మాణానికి సాయం రూ. లక్ష నుంచి 3 లక్షలకు పెంపు
 • బీసీ సంక్షేమం- రూ. 10వేల కోట్లు
 • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కోసం రూ. 9,747 కోట్లు
 • ఐటీశాఖ- రూ. 364 కోట్లు
 • పరిశ్రమలశాఖ- రూ. 2,086 కోట్లు
 • చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ. 125 కోట్లు
 • అమరావతిలో అంబేద్కర్‌ స్మృతి వనానికి రూ. 97 కోట్లు
 • సాంస్కృతిక వ్యవహారాల శాఖ- రూ. 72 కోట్లు
 • అటవీశాఖ- రూ. 383 కోట్లు
 • మత్స్యశాఖ- రూ. 282 కోట్లు
 • పశుగణాభివృద్ధి- రూ. 1,112 కోట్లు
 • గ్రామీణాభివృద్ధి- రూ. 19,567 కోట్లు
 • రహదారుల నిర్వహణకు రూ. 1,102 కోట్లు 

AP Budget 201-18

Have something to add? Share it in the comments

Your email address will not be published.