ఏంజెల్ టీజర్ లాంచ్ చేసిన వి.వి.వినాయక్

Angel movie teaser released by top telugu director Vinayak

Angel movie teaser released by top telugu director Vinayak
శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సింధూరపువ్వ కృష్ణారెడ్డి నిర్మాణ సారధ్యంలో యంగ్ హీరో నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన సినిమా ఏంజెల్. దర్శకధీరుడు రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

ఓ అద్భుతమైన సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లాంఛ్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా హాజరై సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.

వినాయక్ మాట్లాడుతూ, సింధూరపువ్వ కృష్ణారెడ్డి గారితో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తం ఏంజెల్ కోసం చాలా కష్టపడ్డారని, ఈ సినిమాకి మొదటి నుంచి తన సహాయ సహాకారులు అందిస్తున్నట్లుగా తెలిపారు. కథ విన్న వెంటనే తనకి చాలా ఆశక్తిగా అనిపించి కృష్ణారెడ్డిగారిని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీయాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు.

అలానే హీరో నాగా అన్వేష్ చిన్నప్పటి నుంచి నటన పైనే ధ్యాస పెడుతూ చిత్ర సీమలో ఒక్కో మొట్టు పైకి ఎక్కుతున్నాడని, ఈ సినిమా కచ్ఛితంగా అన్వేష్ కెరీర్ ని ఓ కీలక మలుపు తిప్పుతొందని అన్నారు. ఇక వినాయక్ తో పాటు ఈ కార్యక్రమంలో ఏంజెల్ నిర్మాత భువన్ సాగర్, హీరో నాగ అన్వేష్, హీరోయిన్ హెబ్బా పటేల్, సింధూరపువ్వు కృష్ణరెడ్డి, సప్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.