చిత్రాంగద కొత్త ఫీల్‌ను ఇస్తుందంటున్న దర్శకుడు

ఇప్పటివరకు వచ్చిన కామెడీ హర్రర్, కామెడీ థ్రిల్లర్‌ల మాదిరిగా కాకుండా కొత్తగా హారిజెంటల్ థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన సినిమా చిత్రాంగద. పిల్ల జమీందార్ ఫేం డైరెక్టర్ అశోక్ దర్శకత్వంలో  శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మగరాయుడిలా ఉండే చిత్రాంగద క్యారెక్టర్‌ను అంజలి చేసింది. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ఈనెల 10న సురక్ష్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో మల్కాపురం శివకుమార్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తమిళంలో రెండు వారల తరువాత యార్నీ పేరుతో విడుదల అవనుంది.

దర్శకుడు అశోక్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. స్క్రీన్‌ప్లే ప్రధాన హైలైట్‌గా వున్న ఈ చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా చిత్రాంగద జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు.

ఈ సినిమా కోసం అంజలి చాలా కేర్ తీసుకొని పనిచేసింది. అమెరికాలో షూటింగ్ జరిగినన్ని రోజులు అక్కడ మైనస్ డిగ్రీల్లో చలి ఉన్నప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అంజలి తన కాస్ట్యూమ్స్‌లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అంజలి  గ్లామర్ లెవల్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయి.  సప్తగిరి చేసిన కామెడీ సినిమాకే హైలెట్‌గా ఉంటుంది. అంతేగాక అమెరికాలో షూటింగ్ జరిగినప్పుడు జనాల మధ్యలో గొరిల్లా షూటింగ్ చేయడంలో చాలా మజా వచ్చింది. ఈ సినిమాలో రాజారవీంద్ర, సిందుతులానీ, రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి ప్రధానపాత్రల్లో నటించారు. మొదటిసారిగా తండ్రీ తనయుడు సెల్వగణేష్, స్వామినాథన్, మా చిత్రానికి సంగీతమందించారు. మా చిత్రాంగద సినిమా ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను.’ అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.