ఇన్ని దాడులు జరుగుతున్నా మీరు మారరా??

Another Corrupted officer caught by ACB in Andhra Pradesh

గత కొంతకాలంగా దాదాపు రెండు రోజులకి ఒకరిపైన అయినా దాడులు చేస్తూ ఎసిబి అధికారులు చెమటలు పట్టిస్తున్నప్పటికీ అక్రమార్కుల తీరు మాత్రం మారట్లేదు. ఒకరి తర్వాత ఒకరు అవసరంలేని దానికోసం కక్కుర్తి పడి తమ పరువు తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Another Corrupted officer caught by ACB in Andhra Pradesh

లేటెస్ట్‌గా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ప్రణాళికా విభాగపు అధికారి కృష్ణారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు మొదలుపెట్టారు. తుడాకు సంబంధించిన లే అవుట్ల అనుమతులు, భూసేకరణలో ఆయనపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో దాడులు చేసిన అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.

See Also: వెంకన్నపై ఎసిబి దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తిరుపతి రామచంద్రనగర్‌లోని ఆయన ఇంటితో పాటు బంధువులు, స్నేహితులు, తుడా కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణారెడ్డి స్వగ్రామం కార్వేటి నగరం, కుమారుడు ఉంటున్న వెదురుకుప్పం మండలాల్లో సైతం ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇలాంటి ఎసిబి దాడులు జరుగుతున్నా, ప్రభుత్వ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకుండా పోతోంది.

See Also: జగదీశ్వర్‌‌రెడ్డి ఇంట్లో ఎసిబి సోదాలు

Have something to add? Share it in the comments

Your email address will not be published.