బీకాంలో ఫిజిక్స్ కాదు.. డిగ్రీలో సీఈసీ చదివా

Another Jaleel Khan SV Mohan Reddy Studied CEC in Degre

Another Jaleel Khan SV Mohan Reddy Studied CEC in Degre

 

బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ సోషల్ మీడియాలో వైరల్ అయి అందరికీ టార్గెట్ అయిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌ ఉదంతం మరిచిపోకముందే మరో మహానాయకుడు తాను డిగ్రీలో సీఈసీ చదివానంటూ చెప్పి అందరికీ విస్మయాన్ని గురిచేశాడు. అలా మాట్లాడింది ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.

ఇంటర్‌లో ఏ కోర్సు చేశారన్న ప్రశ్నకు ‘ఇంటర్‌లో మామూలుగా సివిక్స్, సివిల్‌.. మామూలుగా జనరల్. అప్పుడు ఎంపీటీసీలు, ఎంపీసీలు ఇవన్నీలేవు. జనరల్‌గా ఉండేది ఇంటర్మీడియట్‌. అప్పుడు ఇంటర్‌లో సీఈసీ లేదు. నేను డిగ్రీకి వచ్చాక సీఈసీ చేశాను’ అని మోహన్‌రెడ్డి జవాబిచ్చారు. దీంతో ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి డిగ్రీలో సీఈసీ ఉండదనడంతోనే.. ఎస్వీ మోహన్‌రెడ్డికి చెమటలు పట్టి టవల్‌తో తుడుచుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎస్వీ మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి చక్కర్లు కొడుతున్నాయి. విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోకముందే ఎస్వీ మోషన్ రెడ్డి వ్యాఖ్యలు  హాస్యాస్పదమైంది. యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రోమో అందరూ నవ్వుకుంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.