ఏడాది క్రితం అదే స్టేషన్… మళ్ళీ సీన్ రిపీట్

Another SI commits suicide in Kukunurpally PS in 10 Months

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేన్ ఎస్‌‌ఐల పాలిట మృత్యుకుహరంలా మారింది. గతేడాది ఆగస్టు16తేదీన రామకృష్ణారెడ్డి అనే ఎస్‌ఐ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మహత్య తర్వాత ఆయన స్థానంలో విధుల్లో చేరిన ప్రభాకర్‌రెడ్డి ఏడాది గడవకముందే రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ప్రభాకర్‌రెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.

Another SI commits suicide in Kukunurpally PS in 10 Months

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన ప్రభాకర్‌రెడ్డి 2012లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు. 2016 ఆగస్టు 26న ఆయన కుకునూరుపల్లి పీఎస్‌లో ఎస్‌ఐగా విధుల్లో చేరారు. గతంలో మల్కాజ్‌గిరి, శామీర్‌పేట, కౌడిపల్లి పోలీస్‌స్టేషన్లలో పనిచేసిన ప్రభాకర్‌రెడ్డి తన గదిలో కుర్చీపై కూర్చుని తుపాకీతో కణతపై కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయారు.

కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో పది నెలల్లో ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్యకు పాల్పడటం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. అయితే పది నెలల క్రితం చనిపోయిన రామకృష్ణారెడ్డి, ఈరోజు చనిపోయిన ప్రభాకర్‌రెడ్డి కూడా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.