థీమ్‌పార్క్ విషయంలో ఇదేం ఆరాటం..??

Another way to exploit money in Shakamuri instead of upgrading Hailand

ఎవరెన్ని నీతి వాక్యాలు చెప్పినా రాజకీయనాయకులు చివరికి మాత్రం చేసేది తమకు లాభం జరుగుతుందనుకున్నప్పుడే… ఈ సూత్రం దాదాపు అందరు రాజకీయనాయకులకి వర్తిస్తుంది. ఈ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు ముందు విజయవాడ గుంటూరు మధ్యలో రాష్ట్రం మొత్తం అందరికీ కొత్తదనాన్ని అందించేందుకు ఏర్పాటైన అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్ హాయ్ ల్యాండ్. అగ్రిగోల్డ్ సంస్థ మంగళగిరి మండలంలోని చినకాకిని గ్రామ పరిధిలో సువిశాల 40 ఎకరాల స్థలంలో జ్ఞానంతో పాటు వినోదాన్ని, ఉల్లాసాన్ని అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ఈ బుద్ధిజం పార్క్ ఏర్పాటు చేశారు.

Another way to exploit money in Shakamuri instead of upgrading Hailand

2010లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య హాయ్ లాండ్‌ను ప్రారంభించారు. ఇందులో చైనా, కాంబోడియా, థాయ్ లాండ్, టిబెట్‌, బర్మా, ఇండోనేషియా, జపాన్‌ జోన్లుగా వివిధ దేశాల పేర్లతో జోన్లు ఏర్పాటుచేసి ఆయా దేశాల సంస్కృతి – సాంప్రదాయాలను తెలిపే విధంగా నిర్మించారు. అంతేగాక పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా వాటర్ స్పోర్ట్స్, వేవ్‌పూల్‌, లేజీరివర్‌, రెయిన్‌ డ్యాన్స్‌ వంటివి ఏర్పాటుచేశారు. వీటికితోడు రైల్‌ఛేజ్‌, గోస్ట్‌ హంటర్‌, మ్యాజిక్‌ డ్యాన్సర్‌, బఫింగ్‌కార్స్‌, ఫ్లైయింగ్‌ ఎలిఫెంట్‌, ప్రైవేట్‌షిప్‌, క్రేజీజంప్‌ స్వింగ్‌ ఏరియంట్‌, ఫ్యామిలీ ట్రైన్‌, గోకార్టింగ్‌, వీడియోగేమ్స్‌వంటి అనేక గేమ్స్‌తో కొత్తలోకాన్ని సృష్టించారు.

ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ వంటలతో పాటు పాశ్చాత్య దేశాల వంటకాలను వడ్డిస్తారు. వీటన్నిటికితోడు హాయ్‌లాండ్‌లో షాపింగ్‌ మాల్స్‌, బార్,కాఫీషాప్‌లు, రిసార్ట్‌లు పర్యాటకుల కోసం అధునాతనంగా నిర్మించారు.  హాయ్‌లాండ్‌లో ఆయుర్ సుఖ్ ఆరోగ్య గ్రామంలో పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా, ఫిజియోథెరపీ శిబిరాలు అందుబాటులో ఉండేవి. 20 లగ్జరీ కాటేజీలు చికిత్సలు పొందే వారికోసం సిద్ధం చేశారు.

అయితే అగ్రిగోల్డ్ వ్యవహారం అదుపుతప్పిన తర్వాత ఇంత గొప్పగా కట్టుకున్న హాయ్‌ల్యాండ్‌‌ను కాస్తా దయ్యాల ల్యాండ్‌గా మార్చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్లోని కీలక ఆస్తి. భారీ ధరే పలకనున్న ఈ రిసార్ట్ తాజాగా వేలానికి వచ్చేయనుంది. ఈ మేరకు ఈ రిసార్ట్ ను వేలం వేయండంటూ ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టు నియమించిన కమిటీకి నివేదించారు. దీంతో హాయ్ ల్యాండ్ ను వేలానికి పెట్టేందుకు ఆ కమిటీ రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇంతమంచి అమ్యూజ్‌మెంట్ థీమ్ పార్క్‌ను కాపాడుకోకుండా కావాలని మూసేసేలా చేసి ఇప్పుడు శాఖమూరులో మరో అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు శ్రీకారం చుడ్తోంది చంద్రబాబు సర్కార్.

Another way to exploit public money instead of upgrading Hailand

అందులోభాగంగా ఏడీసీ సూచనల మేరకు అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ శాఖమూరు ఉద్యాన కేంద్రం భావనాత్మక ప్రణాళికను రూపొందించి ఇచ్చింది. ఈ ఉద్యాన కేంద్రాన్ని ప్రధానంగా నాలుగు జోన్లుగా విభజించారు. నాలుగు జోన్లు కలిపి మొత్తం 241 ఎకరాలలో ఉద్యానకేంద్రాన్ని అభివృద్ధి చేస్తారు. మొదటి జోన్ 85 ఎకరాలు, రెండవ జోన్ 34 ఎకరాలు, మూడవ జోన్ 49 ఎకరాలు, నాలుగో జోన్‌ అంబేద్కర్ పార్క్‌తో కలిపి 73 ఎకరాలు చొప్పున ఉంటుంది.

అందులో మొదటి జోన్‌లో అమ్యూజ్‌మెంట్ పార్క్ ఏర్పాటుచేస్తారు. మొత్తం 46 ఎకరాలలో ఈ అమ్యూజ్‌మెంట్ పార్క్ జోన్ ఉంటుంది. ఇందులో వాటర్ స్పోర్ట్స్‌కు పెద్దపీట వేశారు. ఇందులోనే 10 ఎకరాలలో క్రాఫ్ట్ బజార్ ఏర్పాటుచేస్తారు. 6 ఎకరాలలో ఈవెంట్ ఎరీనా, యాంఫీ ధియేటర్ ఉంటాయి. 23 ఎకరాలలో రిసార్టు ఉంటుంది. ఈ జోన్‌లోనే మ్యూజికల్ ఫౌంటేన్లు, లేజర్ షో ఉంటాయి. అంతేగాక రెండవ జోన్ పూర్తిగా చిల్డ్రన్ జోన్. సాహస క్రీడలను ఇందులో భాగం చేశారు. 27 ఎకరాలలో చిల్డ్రన్ అడ్వెంచర్ పార్కు ఏర్పాటుచేస్తారు. ఒక ఎకరం స్థలంలో అవుట్ డోర్ జిమ్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిల్డ్రన్స్ పార్కులలో ఉన్న ఆకర్షణలన్నీ ఇక్కడ ఉండి తీరాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

మూడవ జోన్‌లో నక్షత్ర వనం, చరక్ వనం, రాశి వనం, పుష్ప వనం ఉంటాయి. 5 ఎకరాలలో చరక్ వనం, రాశి వనం వుంటాయి. 2 ఎకరాలలో పుష్ప, కాక్టస్ వనాలు అభివృద్ధి చేస్తారు. ఈ జోన్‌లో కొంతభాగం వన్య ప్రాణులకు ఉద్దేశించారు. ఐతే, నైట్ సఫారీ కోసం వన్య జీవులకు ఇబ్బంది లేకుండా జురాంగ్ పార్క్ తరహాలో ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాలని ఏడీసీకి ముఖ్యమంత్రి సూచించారు. మూడవ జోన్‌లోనే 3.6 ఎకరాలలో డక్ పాండ్ ఉంటుంది. యోగ, ధ్యాన కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటుచేస్తారు. పాదచారుల కోసం ఆకర్షణీయమైన వంతెన నిర్మిస్తారు.

See Also: చంద్ర’బాబా’ మజాకా???

జోన్ 4లో ఈవెంట్ లాన్, ప్రదర్శన శాలలు, 5 స్టార్ హోటల్, ఇండోర్ అథ్లెటిక్ ఎరీనాతో కూడిన క్లబ్ హౌస్, ఆర్టిస్ట్ ప్లాజా, శిల్ప కళాకేంద్రం వుంటాయి. ఇక్కడే 12 ఎకరాలలో కల్చరల్ మ్యూజియం, ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తారు. 14.6 ఎకరాలలో ఆర్టిస్ట్ ప్లాజా, శిల్ప కళాకేంద్రం ఏర్పాటుచేస్తారు. నాలుగో జోన్‌లోనే 12 ఎకరాలలో ఈవెంట్, ఫెయిర్ గ్రౌండ్ నెలకొల్పుతారు. 12 ఎకరాలలో స్పోర్ట్స్ క్లబ్, కమ్యూనిటీ ఫిట్‌నెస్ సెంటర్ ఏర్పాటుచేస్తారు. 1.5 ఎకరాల స్థలంలో ఇండోర్ అథ్లెటిక్ సెంటర్ ఉంటుంది. 7 ఎకరాలలో 5 స్టార్ హోటల్ ఏర్పాటవుతుంది.

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద అమ్యూజ్‌మెంట్ పార్క్‌గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిత్యం ఇక్కడ ఏదో ఒక ఈవెంట్ జరుగుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఉండాలని చెప్పారు. ఉద్యానవనం మొత్తంలో రెండు, మూడు స్టార్ హోటళ్లు ఉండాలని సూచించారు. లేక్ వ్యూ కాటేజీలు, ఫారెస్టు కాటేజీలకు చోటు కల్పించాలని ఆదేశించారు.

See Also: చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే

మొత్తానికి మంచి ఊపుమీదున్న దానిని దుకాణం మూసుకొనేటట్లు చేసి ఇప్పుడు తమ పేరు కోసం, ఇతర లాభాపేక్షల కోసం కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకురావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.