“ఆర్థిక నేరస్థుడా” చట్టాల గురించి మాట్లాడేది: చంద్రబాబు

AP CM Chandrababu fires on YS JaganMohan Reddy on his delhi visit and the cabinet expansion

AP CM Chandrababu fires on YS JaganMohan Reddy on his delhi visit and the cabinet expansion

  • ఈడీ ట్వీట్‌పై జగన్‌ సమాధానం చెప్పాలి
  • ఇతర పార్టీల వాళ్ళని జగన్ ఎప్పుడూ చేర్చుకోలేదా??
  • విశాఖలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తిన చంద్రబాబు

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపిన అంశం ఏదైనా ఉందా అంటే అది ఎపి మంత్రివర్గ విస్తరణ అనే చెప్పుకోవాలి. నారాలోకేష్‌తోపాటు మరొో పదిమందిని మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకున్నదానికంటే ప్రతిపక్షపార్టీ వైఎస్సాఆర్సీపీ గుర్తుపై గెలిచిన తర్వాత టీడీపీలోకి మారిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు ఇవ్వడంపై  పెద్ద ఎత్తున దుమారం చెలరేగి ఆరోజు నుండి ఇంకా కొనసాగుతూనే ఉంది.

వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన వారికి మంత్రిపదవులు ఇవ్వడంపై అలిగిన టీడీపీ నాయకులను చంద్రబాబు నయానో భయానో దారికితెచ్చుకున్నప్పటికీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాంవేసి మొదట రాష్ట్రపతిని ఆతర్వాత కేంద్రంలోని సీనియర్ మంత్రులను ఆతర్వాత వివిధ రాజకీయపార్టీల పెద్దలను కలిసి ఫిరాయింపు రాజకీయాలపై తన బాధను వారితో వెళ్ళగక్కుకుంటున్నారు.

అయితే ఇక్కడివరకు గత రెండు రోజులుగా జగన్ ఢిల్లీలో రాజకీయం చేసుకుంటూ తిరుగుంటే ఎలాంటి వ్యాఖ్యలు చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖ పర్యటనలో ధ్వజమెత్తారు. ఫిరాయింపుదారుల్లో సమర్థులైన నాయకులు ఉన్నందుకే వారికి మంత్రిపదవులు ఇచ్చానని చెప్పుకొచ్చిన చంద్రబాబు, మంత్రివర్గ విస్తరణలో అందరికీ న్యాయం చేయలేకపోయామని బాధపడ్డారు. తెలంగాణాలో తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్‌లోకి వెళ్ళేటప్పుడు నేను మాట్లాడాను అయితే అప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు అని చెప్పుకొచ్చారు.

అయితే ఫిరాయింపు రాజకీయాలపై జాతీయస్థాయిలో చర్చ జరగడం మంచిదేనన్న చంద్రబాబు ఆర్థిక నేరస్థుడు దిల్లీకి వెళ్లి చట్టాలు, రాజ్యాంగంపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు. ఇతర పార్టీ వాళ్లను జగన్‌ ఎప్పుడూ చేర్చుకోలేదా? అని ప్రశ్నించారు. అంతేగాక డొల్ల కంపెనీలో జగన్‌ పెట్టుబడులు పెట్టినట్టు ఈడీ ట్వీట్‌ చేసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం.. ఆ ట్వీట్‌పై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర అభివ‌ృద్ధే లక్ష్యంగా పనిచేసేలా శాశ్వతంగా అధికారంలో ఉంటేనుే సుస్థిర అభివ‌ద్ధి సాధ్యమని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.