చెప్పేవన్నీ శ్రీరంగ నీతులే

AP CM Chandrababu highlight comments on Environment and Greenery

AP CM Chandrababu highlight comments on Environment and Greenery

ఆయన చెప్పే మాటలకు చేసే చేతలకు ఏమాత్రం సంబంధం ఉందడదనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు వ్యతిరేకంగానే చేతలు ఉంటాయి కాబట్టి. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల పంటపొలాలు ధ్వసం చేసి కాంక్రీట్ బిల్డింగ్‌లు కడుతోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యావరణం  పరిరక్షణ అంటూ పెద్ద మాటలు చెబుతున్నారు. ప్రకృతితో అనుసంధానమైన మనిషి.. ప్రకృతిని కాపాడాలడన్న చంద్రబాబు అమరావతి రాజధాని కోసం పర్యావరణ రక్షణ ఎంత గొప్పగా చేశారో అందరికి తెలిసిన విషయంమే. సిరులు పండించే పచ్చని పంటపొలాలను తెగనరికినప్పుడు చంద్రబాబుకి ప్రక‌ృతిని కాపాడాలని ఏమాత్రం గుర్తుకురాలేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

ధరిత్రి దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ అందరికీ హితబోధ చేశారు.  భూసారం క్షీణించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు భూసార పరీక్షలు ఇందులో భాగమేనని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక కర్తవ్యమని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చంద్రబాబు సూచించారు. పచ్చదనం ద్వారా కనీసం 2% ఉష్ణోగ్రతలు తగ్గించగలిగితే రాష్ట్రంలో మరింత ఆహ్లాద జీవనం సాగించవచ్చని సీఎం ఆకాంక్షించారు.  అంతేగాక కాలుష్యం తగ్గించగలిగితే పుడమికి రక్ష అని సీఎం చంద్రబాబు నాయుడు తెలియచేశారు.

అయితే పచ్చదనం, పర్యావరణం గురించి సమీక్ష సమావేశాల్లో ఇంత గొప్పగా జాతి ఉద్ధరణ మాటలు మాట్లాడే చంద్రబాబుకి పచ్చని పంటపొలాలను లాక్కొన్నప్పుడు గుర్తుకురాలేదా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.