ర్యాంకు మెరుగుపడకపోతే నో టికెట్: చంద్రబాబు

AP CM Chandrababu warns MLAs at Coordination committee meeting No Rank No Ticket

పాలసీలను ప్రవేశపెట్టడంలోనూ, వాటిని అమలుచేయడంలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుటారు. అయితే అవి ప్రజలకు అందే పాలసీలైనా, సొంతపార్టీలో నాయకులను సెట్ చేసే పాలసీలైనా… ఆయనకు సాటి ఎవరూ రారు. పదేళ్ళపాటు అధికారానికి దూరంగా ఉండి 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అటు ప్రభుత్వ కార్యక్రమాలను చూసుకుంటూనే పార్టీ బలోపేతంపైనా ద‌ృష్టిపెడుతూనే ఉన్నారు.

AP CM Chandrababu warns MLAs at Coordination committee meeting No Rank No Ticket

అందులోభాగంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ద‌ృష్టిపెట్టిన బాబు ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ర్యాంకింగ్ ఆధారంగా మంత్రులను కొందరిని తప్పించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ఈరోజు తెదేపా సమన్వయ కమిటీ దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యింది.

ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, సమన్వయ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చే ప్రక్రియ ఇకపైనా కొనసాగుతుందని.. ర్యాంకులు మెరుగుపడని వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు. అంతేగాక ఇటీవల గుంటూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు

See Also: వీడికిదేం నోటి దూల: RGV కి పోటీ అవుతున్నాడుగా

మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు తెలుగుదేశం పార్టీని ప్రజలకు మరింత దగ్గరికి చేసే ప్రయత్నాలను మొదలుపెట్టనున్నారు. అందులోభాగంగా సెప్టెంబర్‌ 1 నుండి అక్టోబర్ 30తేదీ వరకు ‘ఇంటింటికీ తెదేపా’ కార్యక్రమాన్ని రెండు నెలలపాటు చేపట్టాలని నిర్ణయించారు. అంతేగాక నంద్యాల ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాలని.. అందుకు అనుగుణంగా నేతలంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు.

వీటికితోడు గత మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై సమన్వయ కమిటీ సభ్యులతో చంద్రబాబు చర్చించారు.

See Also: పీఠం కోసం తెర వెనుక మంతనాలు

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.