దుర్గగుడికి పాలకమండలి నియామకం

AP Government constituted new Board members for Durga Temple Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వరస్వామివార్ల ఆలయానికి కొత్త పాలకమండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటినుండి బెజవాడ దుర్గగుడి పాలక మండలి ఏర్పాటులో రాజకీయం హాట్‌గా తయారైంది. దుర్గగుడి పాలక మండలిలో చోటు సంపాదించటానికి అధికార టీడీపీ, మిత్ర పక్షం బీజేపీ నేతలు పోటీ పడ్డారు. తమ గాడ్ ఫాదర్లుగా ఉన్న తమ తమ పార్టీలోని అగ్ర నేతలతో సిఫార్సులు కూడా చేయించుకున్నారు.

AP Government constituted new Board members for Durga Temple Vijayawada

గతంలో బెజవాడ దుర్గమ్మ ఆలయ పాలక మండలి ఏర్పాటు వ్యవహారం టీడీపీ, బీజేపీలో వివాదాలకు కారణమవుతోంది. నామినేటెడ్ పదవుల పంపిణీ మాత్రం రెండు పార్టీల మధ్య అగాధానికి తెరలేపింది. అయితే ప్రభుత్వం తాజాగా 16మంది సభ్యులతో పాలకమండలిని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొని ఉత్తర్వులను జారీ చేశారు. కొత్తగా ఏర్పాటైన పాలకమండలి రెండేళ్ళపాటు కొనసాగనుంది. అయితే పాలకమండలిలో చోటుకోసం ప్రయత్నాలు చేసినవారిలో 16మందికే చోటు దక్కడంతో మిగతావారికి నిరాశే ఎదురైంది.

See Also: చంద్రబాబుకు లేఖరాసిన ఉండవల్లి

 

See Also: బయటికొస్తున్న కొత్త కోణాలు

Have something to add? Share it in the comments

Your email address will not be published.