సోషల్ మీడియాపై ఎటాక్

AP government rides continue on Social Media offices in Hyderabad after political satires boomrang

AP government rides continue on Social Media offices in Hyderabad after political satires boomrang

ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఏదో ఒక తప్పు మాట్లాడి సోషల్ మీడియాలో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా మారిన ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖా మంత్రి నారా లోకేష్‌ ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయా?? రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి ఏదో ఒక సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తుండడంతో ఫీలవుతున్న చంద్రబాబు తనయుడు తనపై సెటైర్లు వేస్తున్న వారిని రిటైర్ చేయాలని కంకణం కట్టుకున్నాడట. అందులో భాగంగా తనపై, తన పార్టీపై సెటైర్లు వేసే వారిని ఉపేక్షించేది లేదని సోషల్ మీడియాపై ఆపరేషన్ సెటైర్‌ను మొదలుపెట్టారు.

సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై సీరియస్‌గా ఉన్న చంద్రబాబు వాటిని అడ్డుకోవడానికి తన వంతు క‌‌ృషి చేస్తున్నారు. సోషల్‌మీడియాను అడ్డుకోవడానికి కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ తప్పులు, లోపాలను సోషల్‌ మీడియా ఎత్తిచూపడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న సెటైర్లను ఎదుర్కోలేకే అరెస్ట్‌లు చేసి మిగతావారిని భయభ్రాంతులను చేయాలనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. అందులోభాగంగానే పొలిటికల్‌ పంచ్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ మరవక ముందే ఇవాళ వైఎస్‌ఆర్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యాలయంలో పోలీసులు సోదాలు చేపట్టారు.

Police rides on YSRCP IT Wing Office

అందులోభాగంగా ఓ వైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా…మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సోషల్‌ మీడియాపై దాడులు కొనసాగిస్తోంది. ఏపీ పోలీసులు హైదరాబాద్‌‌లోని వైసీపీ సోషల్‌ మీడియా విభాగం కార్యాలయంపై దాడి నిర్వహించి సోదాలు చేశారు. అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు.

పోలీసు సోదాల గురించి ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసుల సమక్షంలోనే ఎపి అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు ఫోన్ చేసి నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ ఫిర్యాదుపై స్పందిస్తే వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అనేక అవాకులు, చవాకులు పేలారని, సభ్య సమాజం హర్షించలేని పోస్టింగ్‌లు వైఎస్‌ జగన్‌పై పెట్టారని గుర్తుచేశారు. అంతేగాక వైఎస్‌ జగన్‌ ను దూషిస్తూ మంత్రి లోకేశ్‌ పెట్టిన ట్వీట్లను వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పోలీసులకు చూపించారు.

Police rides on YSRCP IT Wing Office2

వైఎస్ జగన్‌పై సోషల్‌మీడియాలో వస్తున్న పోస్టింగ్‌లకు సంబంధించి టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని ప్రశ్నించారు విజయ్ సాయి రెడ్డి. వైసీపీలోని అన్ని విభాగాలకు తానే ఇంఛార్జ్‌ని అని, నోటీసులు ఇవ్వదలిస్తే తనకే ఇవ్వాలని విజయసాయిరెడ్డి పోలీసులతో అన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.