‘అయ్యన్నా’ రోజాపై ఎందుకంత ప్రేమన్నా..??

AP Minister Ayyanna Patrudu comments on MLA Roja in Assembly

AP Minister Ayyanna Patrudu comments on MLA Roja in Assembly

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పాపులర్ ఎవరని పోటీ పెడితే ఎక్కువగా ఓట్లు ఎవరికి పడుతాయనుకుంటున్నారు? టీడీపీ వాళ్ళందరూ చంద్రబాబుకి వైసీపీ వాళ్ళందరూ జగన్‌కి ఓటేస్తారనుకుంటే మీరు తప్పు చేసినట్లే… ఎందుకంటే వీళ్ళిదరు కాకుండా గత మూడేళ్ళుగా అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారి అందరు ముఖ్యంగా అధికార సభ్యుల నోళ్ళలో నానుతున్న పేరు ఆర్కె.రోజా. మూడేళ్ళుగా అసెంబ్లీలో టాపిక్  ఏదైనా అధికారపక్ష సభ్యుల్లో కొంతమంది పసుపు తమ్ముళ్ళు రోజాను ఆ విషయంలోకి లాగి ఆమెపై తమకున్న ప్రేమను అభిమానాన్ని అసెంబ్లీ సాక్షిగా చూపించుకుంటున్నారు.

ఇది నిజం ఎందుకంటే నగరి ఎమ్మెల్యేగా రోజా ఎన్నికైనప్పటినుండి అటు అసెంబ్లీ లోపలా బైటా తమ పార్టీని కాపాడుకొనేందుకు అష్టకష్టాలు పడ్డారు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ధర్నాలు, అసెంబ్లీ దగ్గర నిరసనలు చేయడంవంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోపల జరిగిన గొడవలో టీడీపీ ఎమ్మెల్యే అనిత పుణ్యమాని కొన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉండి షూటింగుల్లో బిజీగా ఉన్న రోజాను, అసెంబ్లీ లోపల చాలామంది అధికార పక్ష సభ్యులు చాలా మిస్ అయినట్లుగా అనిపిస్తోంది వాళ్ళ మాటలు వింటోంటే.

MLA Roja

ఎందుకంటే ఎవరిద్దరు మాట్లాడినా అటు మధ్యలో ఇంకొకరు లేచి రోజా ప్రస్తావన తీసుకురావడం కామనైపోయింది అసెంబ్లీలో. సినీ నటిగా పాపులర్ అవ్వడమేకాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా సంవత్సరాలు చంద్రబాబు పర్యవేక్షణలో టీడీపీలో మహిళా అధ్యక్షురాలిగా పనిచేసే స్థాయి వరకు వెళ్ళారు రోజా. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాలతో రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో చేరిన రోజా ఆ తర్వాత జగన్ ప్రారంభించిన వైసీపీలో చేరి  అప్పటినుండి కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే పాత స్నేహం ఊరికే పోదనట్లుగా టీడీపీలో చాలామంది పాత నాయకులకు రోజాతో ఉన్న పరిచయాన్ని వాళ్ళ మాటల్లో బయటపెడుతుంటారు.

ధూళిపాళ్ళ నరేంద్ర, పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు అటు అసెంబ్లీలోనూ ఇటు పార్టీలోనూ చాలాసార్లు రోజాను టార్గెట్ చేసి మాట్లాడారు. అయితే లేటెస్ట్‌గా ఈ లిస్ట్‌లో పంచాయితీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు వచ్చి చేరారు. ఈరోజు అసెంబ్లీలో మొగల్తూరు అక్వా పార్క్ ప్రమాదంపై చర్చ జరిగిన సమయంలో సభలో ఇరు పక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. జగన్, అచ్చెన్నాయుడు మధ్య వాగ్యుద్ధం కనిపించింది. అవసరమైతే జగన్, తాను కలిసి అక్వా ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని పరిశీలిద్దామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

‘ ఈ సమయంలో అయ్యన్నపాత్రుడు ఎంత పంచాయితీరాజ్ మంత్రి అయితే మాత్రం వీళ్ళిద్దరి పంచాయితీ తీర్చమని ఎవరో అడినట్లు లేచి  జోక్యం చేసుకున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ వద్దకు జగన్, అచ్చెన్నాయుడు వెళ్తామని చెబుతున్నారని, వారికి తాను ఓ సూచన చేస్తున్నానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాను కూడా తీసుకువెళ్తే బాగుంటుందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. వాళ్ళిద్దరు ఏదో సీరియస్‌గా వాగ్వివాదం చేసుకుంటుంటే అయ్యన్నపాత్రుడిగారికి సడన్‌గా రోజా గారు ఎందుకు గుర్తుకు వచ్చారో ఎవరికీ అర్థంకాలేదు. అంతేగాక అయ్యన్నపాత్రుడు రోజా పేరు చెబితే అందరూ నవ్వుతారు తాను హీరో అవుతానని అనుకొని అలాంటి డైలాగ్ వేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓ మనిషిపై ఉండే అభిమానం ఆ మనిషి దూరం వెళ్ళినా మనసు మాత్రం ఆపుకోలేదని అయ్యన్నపాత్రుడు నిరూపించేశారు. ‘

 

ఈ వీడియోలో 03 నిమిషాల 13 సెకన్లప్పుడు మంత్రి అయ్యన్నపాత్రడు మాట్లాడుతారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.