టీఆర్‌ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం: హోర్డింగులు వద్దంటున్న పార్టీ

ARRANGEMENTS ARE IN FULL SWING FOR TRS PLENARY IN Kompally and Huge turnout expected

ARRANGEMENTS ARE IN FULL SWING FOR TRS PLENARY IN Kompally and Huge turnout expected

తెలంగాణా రాష్ట్ర సమితి 16వ ప్లీనరీకి సర్వం సిద్ధం అయ్యింది. ఈనెల 21న కొంపల్లిలో జరుగబోయే ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లను గత రెండు మూడు రోజులుగా మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 21న ఉదయం 10:30గంటలకు ప్రారంభమయ్యే ప్లీనరీకి అదే సమయానికి ముఖ్యమంత్రి కెసిఆర్, ఇతర ప్రజాప్రతినిధులు ప్రాంగణానికి చేరుకుంటారని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈరోజు ప్లీనరీ ప్రాంగణాన్ని పరిశీలించిన తర్వాత కెటిఆర్ మీడియాతో మాట్లాడారు.

ప్లీనరీ సందర్భంగా ఐదెకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు ప్రజాప్రతినిధులకు, కళాకారులకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ ప్లీనరీ కవర్ చేయడానికి వచ్చే మీడియా ప్రతినిధులకోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అంతేగాక మహిళలకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని చెప్పిన కెటిఆర్ ప్రతీ నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజాప్రతినిధులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. ఈయేడాది ప్లీనరీకి వచ్చే వారందరికీ ప్రత్యేక పాస్‌లు ఇస్తున్నామని, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా పాస్‌లు ఉండాలన్నారు. అంతేగాక 31 జిల్లాల నుంచి వచ్చే వారందరికీ ప్రాంగణం దగ్గర ప్రత్యేక పాస్‌లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు మంత్రి కెటిఆర్.

అంతేగాక ప్లీనరీ జరిగే 21తేదీ ఉదయం 10:30కి ముఖ్యమంత్రి కెపసిఆర్ ప్రాంగణానికి చేరుకున్న వెంటనే పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని ఆతర్వాత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించే కార్డంయక్రమం ఉంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడిని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటిస్తారని, ఆ తర్వాత  స్వాగతోపన్యాసం పార్టీ అధ్యక్షుడి ప్రసంగంతో ప్లీనరీ ప్రారంభమవుతుందన్నారు కెటిఆర్. మద్యాహ్నం రెండు గంటలకు భోజన విరామం తర్వాత మళ్ళీ సమావేశం ప్రారంభమై తీర్మానాల కార్యక్రమం సాయంత్రం 5గంటలకు పూర్తవుతుంది. ఆ తర్వాత 5 గంటలకు కేసీఆర్ ప్రసంగంతో ప్లీనరీ ముగుస్తుందని తెలిపారు.

టీఆర్‌ఎస్ ప్లీనరీ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో పార్టీ హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని సూచించారు కెటిఆర్. నిబంధనలు అతిక్రమించొద్దని జీహెచ్‌ఎంసీ పరిధిలో కాకుండా మిగతా చోట్ల హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అంతేగాక ప్లీనరీకి 31 జిల్లాల నుంచి వచ్చే వాహనాలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారానే రావాలని , దానికి తగ్గట్లుగానే నగర శివార్లలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాక నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.