అరుణ్ జైట్లీ ప్రకటించేశారు

Arun Jaitley Confirms on Govt considering about Financial year Change

మోడీ హయాంలో ఇన్నేళ్ళు అందరికీ తెలిసిన పద్ధతుల స్థానంలో కొత్త ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే గతేడాది నోట్ల రద్దు, కొత్త నోట్లను ప్రవేశపెట్టి అందరినీ విస్మయానికి గురిచేసి ఆర్థికరంగంలో పెద్ద మార్పు తీసుకొచ్చిన మోడీ మరికొన్ని ఆలోచనలను తెరపైకి తీసుకొచ్చారు.

Arun Jaitley Confirms on Govt considering about Financial year Change

కొత్త ఆవిష్కరణలతో ఆర్థిక సంస్కరణల మార్పుకు కృషి చేస్తున్న కేంద్రప్రభుత్వం మరో పాత సంప్రదాయానికి తెరదించాలని యోచిస్తోంది. దానికి తగ్గట్లుగానే  గతంలో మాదిరిగా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు కాకుండా జనవరి నుంచి డిసెంబర్‌ వరకు లెక్కగట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనకు సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో ప్రకటించారు.

See Also: రాజకీయ రంగు పులుముకుంటున్న డ్రగ్స్ కేసు

గతంలో రైల్వే బడ్జెట్‌ ప్రత్యేకంగా ఉండగా ఆ విధానానికి స్వస్థి పలికి అంతా ఒకే బడ్జెట్‌గా మార్చిన  కేంద్రం, పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చింది. అంతేగాక ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిన కేంద్రం మరోసారి ఆర్థిక సంవత్సరం కూడా మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

See Also: ఓడినా అందరి మనసులు గెలిచిన మీరాకుమార్

అయితే ఒకవేళ ఆర్థిక సంవత్సర షెడ్యూల్‌ మారిస్తే 2018 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరిలో కాకుండా డిసెంబర్‌లో ప్రవేశ పెడతారా, నవంబర్‌లో ప్రవేశపెడతారా అని ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు నిరాకరించారు ఆర్థికశాఖామంత్రి అరుణ్‌ జైట్లీ.

Have something to add? Share it in the comments

Your email address will not be published.