రసవత్తరంగా ‘నంద్యాల నాటకం’

As no one is assured of allocation of seat for Nandhyal by-poll, both Shilpa Mohan Reddy and Akhila Priya though in dilemma express confidence

As no one is assured of allocation of seat for Nandhyal by-poll, both Shilpa Mohan Reddy and Akhila Priya though in dilemma express confidence

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత నంద్యాల ఉపఎన్నిక టిడిపికి తలనొప్పిగా మారింది. అక్కడ ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్న టిడిపి నాయకత్వం అక్కడ స్థానిక పరిస్థితులను అంచనావేయడంలో తలమునకలైపోతోంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న శిల్పా మోహన్ రెడ్డి భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలను టిడిపిలోకి ఆహ్వానించినప్పటినుండి కాస్త సీరియస్‌గానే ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో భూమా నాగిరెడ్డి మరణం తర్వాత శిల్పా మోహన్‌రెడ్డికి ఏమాత్రం ఇష్టంలేకపోయినా తప్పనిపరిస్థితుల్లో అఖిలప్రియకు చంద్రబాబు మంత్రిపదవి ఇవ్వాల్సి వచ్చింది.అయితే అప్పుడు కూడా అభ్యంతరం చెప్పని శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు టికెట్ దక్కకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాస్తవానికి నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. దాంతో ఆయనతో ఈ విషయమై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మోహన్ రెడ్డిని విజయవాడ రప్పించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ కావాల్సి ఉండగా, ఈలోపే అఖిలప్రియ ఏకపక్షంగా ఇలా ప్రకటన చేయడం ఎవరికీ మింగుడు పడటం లేదు.

ఒకవైపు ఆయనను మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా భూమా అఖిల ప్రియ చేసిన వ్యాఖ్యలు టిడిపిలో కలకలం రేపుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు.

ఈ ఉప ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఉప ఎన్నిక గురించి ఇంతవరకు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుగానీ, లోకేశ్‌గానీ  ఎలాంటి ప్రకటనలు చేయకముందే అఖిలప్రియ ఉపఎన్నికల్లో తమ కుటుంబం నుండే అభ్యర్థి ఉంటారన్న విషయాన్ని వెల్లడించడం శిల్పా మోహన్‌రెడ్డి ఆలోచనలకు చెక్ పెట్టడానికే చేశారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఒకవైపు చంద్రబాబుతో శిల్పా భేటీ ఉందని తెలిసి కూడా ఉపఎన్నిక అభ్యర్థి గురించి అఖిలప్రియ వ్యాఖ్యలను పార్టీ ఏ విధంగా అర్థం చేసుకుంటుందో మరి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో శిల్పామోహన్య రెడ్డి భేటీ అయ్యారు. నంద్యాల ఉపఎన్నిక టికెట్‌పైనే చర్చ జరుగుతోంది. తనకు టికెట్ ఇవ్వకపోతే తన వర్గానికి మనుగడ ఉండదని శిల్పా వాదిస్తున్నారు. అయితే శిల్పా మోహన్ రెడ్డి వాదనకు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ ‌రెడ్డి చంద్రబాబు దగ్గర మద్దతు తెలుపుతున్నారని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.