కమలం హవా కొనసాగిస్తుందా?

ఉత్తరప్రదేశ్‌ : మొత్తం సీట్లు 403 ..  మేజిక్‌ ఫిగర్‌ 202
పంజాబ్‌: మొత్తం సీట్లు..117 .. మేజిక్‌ ఫిగర్‌ 59
ఉత్తరాఖండ్‌: మొత్తం సీట్లు 70 .. మేజిక్‌ ఫిగర్‌ 36
మణిపూర్‌: మొత్తం సీట్లు 60 .. మేజిక్‌ ఫిగర్‌ 31
గోవా: మొత్తం సీట్లు 40 ..  మేజిక్‌ ఫిగర్‌ 21

దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎవరిని గద్దెనెక్కిస్తాయన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఉదయం 8గంటలకే యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. 11 గంటలకల్లా ఫలితాలపై ఓ అంచనావచ్చి 12 గంటలకల్లా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కౌంటింగ్ కోసం  పోలింగ్‌ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలతో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.

ప్రధాని  మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడుతారోనన్నదానిపై సర్వత్రా చర్చ జరగుతోంది. యూపీలో  మొత్తం 403 సీట్లు ఉండగా మేజిక్ ఫిగర్ 202గా ఉంది.  బిజేపీ అధిక సీట్లు గెలిచే దిశగా దూసుకెళ్తున్నప్పటికీ పూర్తి ఫలితాలు వచ్చేవరకు తప్పకుండా ఆగాల్సిన పరిస్థితి ఉంది.

పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.  అయితే ఉదయం కౌటింగ్ ప్రారంభం అయిన తర్వాత నుండి పరిస్థితులు అంతా బిజెపికి అనుకూలంగా ఏమీ కనిపించట్లేదు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌ల్లో బిజెపి హవా కొనసాగుతుంటే పంజాబ్, గోవాల్లో హస్తం హవా కొనసాగుతోంది. అయితే అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో ఓ మోస్తారు సీట్లు గెలుచుకొనే దిశగా ముందుకు వెళ్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.