డబ్బులేదు……సుఖంలేదు

ATMs sport 'no-money' signs again, Hyderabad goes cashless

ATMs sport 'no-money' signs again, Hyderabad goes cashless

నాలుగు నెలల క్రితం మనదేశంలో డబ్బులులేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారో సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితి మనదేశంలో ఇప్పుడు నెలకొంది. ఓ వైపు నెలరోజులుగా తెరచుకోని ఏటీఎంలు, మరో వైపు బ్యాంకుల్లో నిండుకున్న నగదు నిల్వలతో ఖాతాదారులు చేతిలో డబ్బులేక లబోదిబోమంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితే, ఇప్పుడూ కనిపిస్తోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో గడచిన నెల రోజులుగా 80 శాతం ఏటీఎంలు తెరచుకోలేదంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో బ్యాంకుల్లో నగదును విత్ డ్రా చేసుకునేందుకు వెళ్లిన వారికి సైతం ‘నో క్యాష్’ బోర్డులు కనిపిస్తున్నాయి.

డబ్బులు ఉన్న బ్యాంకుల్లో విత్ డ్రాపై ఆంక్షలను అమలు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రాపై అమలులో ఉన్న ఆంక్షలన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసినప్పటికీ, రూ. 30 వేలకు మించి ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెబుతున్నారు. ఆర్బీఐ నుంచి కొత్త కరెన్సీ రావడం లేదని, భవిష్యత్తులో నగదు కష్టాలు మరింతగా పెరుగుతాయని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యాంకుల నుంచి ఖాతాదారులకు చేరిన కొత్త కరెన్సీ, ముఖ్యంగా రూ. 2 వేల నోట్లు తిరిగి డిపాజిట్ లకు నోచుకోకపోవడమే మొత్తం సమస్యకు కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

దాదాపు నెలరోజుల నుండి దేశంలో ఏ ఎటిఎంలోనూ డబ్బులులేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దాంతో బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఇప్పుడు మనదేశంలోని బ్యాంకుల్లో మళ్ళీ డబ్బులు నిండుకున్నాయి. నోట్ల రద్దు వల్ల ప్రజలు కొత్త నోట్లు వచ్చిన వెంటనే అందరూ మళ్ళీ దొరకవనుకొనేలా ఉన్నవన్నీ ఊడ్చేసి ఇళ్ళకు పట్టుకెళ్ళారు. అంతేగాక బ్యాంకుల్లో దాచిపెట్టుకున్న డిపాజిట్లను అన్నింటినీ క్లోజ్ చేసేసారు. దీనికితోడు ఈ మూడు నెలల్లో ఏమాత్రం డిపాజిట్లు జరగకపోవడంతో బ్యాంకుల్లోనూ విత్‌డ్రాల కోసం డబ్బులు ఇచ్చే పరిస్థితిలేకుండా పోయింది.

ఇప్పటివరకు రిజర్వ్ బ్యాంక్‌ నుండి 40 వేల కోట్ల విలువైన రెండు వేల రూపాయలను  చెస్ట్‌లు బ్యాంకులకు సరఫరా చేస్తే ఇప్పుడు అన్ని బ్యాంకుల వద్దా ఉన్నది అయిదు లేదా పది వేల కోట్ల విలువైన 2 వేల రూపాయల నోట్లే మిగిలాయి. నోట్ల రద్దు తర్వాత వచ్చిన 2వేల నోట్లను రాబోయే ఎన్నికలకోసం రాజకీయనాయకులు, అక్రమార్కులు, దళారీలు ఇన్నాళ్ళు బ్యాంకుల్లో ఉంచుకున్న మనీ మొత్తం బయటికి తీసుకొచ్చి బ్లాక్‌మనీని చేసిపారేశారు. దీంతో ఇప్పుడు మళ్ళీ బ్లాక్‌మనీ విషయంలో పాత పరిస్థితే ఏర్పడింది.

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చి బిజెపి అధికారంలోకి వచ్చేయడంతో ఇప్పడు మళ్ళీ బ్లాక్‌మనీపై మోడీ సర్కార్ ద‌ృష్టిపెట్టే ఆలోచనలో ఉంది. ఇప్పటికైనా పరిస్థితి దారికొస్తుందని ప్రజలు ఆశపడుతున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.