ఎవరికి ఏం కావాలో ఈ బాబుకి బాగా తెలుసు..!

avasarala-srinivas-babu-baga-busy-teaser-hits-half-million

క్లాస్ కమేడియన్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడుగా మారి, ఇప్పుడు హీరోగా మారిన అవసరాల శ్రీనివాస్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందుకే ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న అవసరాల కొత్త అవతారంలోనూ యమ క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఎంతలా అంటే బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన హంటర్ సినిమా రీమేక్‌లో హీరోగా నటించిన అవసరాల సినిమా బాబు బాగా బిజీ. ఈ సినిమా హోళీ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత బుధవారం సాయంత్రం టీజర్ విడుదలైన 12 గంటలలోనే హాఫ్ మిలియన్ మార్కును దాటేసింది. ఈ మధ్య టీజర్లు, ట్రైలర్లు రిలీ.నప్పుడు యూట్యూబ్‌లో ఎంతవైరల్‌గా వెళ్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు యూత్ పల్స్ పట్టుకున్న అవసరాల తనదైన స్టైల్లో బాబు బాగా బిజీలో అడల్ట్ కామెడీని పండించాడు. దీంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందన్న దానిపై చర్చ జరగుతోంది.

Baabu Baaga Busy First look poster

 

బాలీవుడ్ ‘హంటర్’ సినిమా చూసిన వారికి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అన్న మ్యాటర్ ఈజీగా అర్థమైపోతుంది. అంతేగాక కొత్తగా తెలుగులోనే సినిమా చూసేవాళ్ళకి మాత్రం టీజరే కిక్ ఎక్కించగా సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. టీజర్‌లో అవసరాల బాబు ఎంత బిజీగా ఉన్నాడో చాలా రొమాంటిక్‌గా చూపించాడు. ‘ఆర్ యు వర్జిన్’ అన్న లేడీ డైలాగ్ కు ‘అదెప్పుడో పదిహేనేళ్ళ క్రితం’ అంటూ అవసరాల చెప్పిన డైలాగ్ తో, తాము ఈ సినిమా ఏం చూపించబోతున్నారో అర్థమైపోతోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.