బాహుబలి-2 టికెట్లకు రెక్కలు ఒక్కో టికెట్ @2400/-

Baahubali 2 ticket prices leave fans shocked for Premiers and in Multiplexes

 

Baahubali 2 ticket prices leave fans shocked for Premiers and in Multiplexes

బాహుబలి -2 క్రేజ్‌ ఎంత ఉందో తెలుసుకోవాలంటే ఆన్‌లైన్ టికెట్లు అమ్మే వెబ్‌సైట్లు, సినిమా థియేటర్ల దగ్గర కోలాహలాన్ని చూస్తే ఈజీగా అర్థమైపోతోంది. అంతలా క్రేజ్ ఉన్న బాహుబలి2 సినిమా టికెట్లు కూడా కొన్ని చోట్ల ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రీమియర్లు సైతం వేయడానికి రంగం సిద్ధం అవ్వడంతో టికెట్ల ధరలకు రెక్కలొచ్చాయి. భారతీయ సినీమా చరిత్ర రికార్డులను తిరగరాయడానికి విడుదలౌతున్న బాహుబలి 2 సినిమాను ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. దేశవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లపై రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఒక్క టికెట్  2,400 రూపాయలకు అమ్ముడౌతుంది.

Baahubali 2 ticket prices leave fans shocked for Premiers and in Multiplexes 

ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్‌లో ఒక్క టికెట్ ధర 2వేలు, 2వేల400 రూపాయలుగా ఉంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను ఆర్కామీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాహుబలి ఫీవర్ మరీ ఎక్కువైంది. ఇప్పటికే వచ్చే వారం రోజుల టికెట్లు ఆన్‌లైన్లో అమ్ముడవగా థియేటర్ల దగ్గర అమ్మే టికెట్ల కోసం జనాలు బారులు తీరుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.