బాహుబలి-2 పబ్లిసిటీపై ద‌ృష్టిపెట్టిన జక్కన్న

బాహుబలి సినిమా జాతీయస్థాయి సినిమా గా గుర్తింపు తెచ్చుకుంది.ఈ మూవీ రూపొందింది టాలీవుడ్ లో అయినా అన్ని భాషల్లోనూ రిలీజ్ అయింది.ఈ చిత్రాన్ని ఎక్కడివారు అక్కడ తమ సినిమాగా ఆదరించారు.బాహుబలి ది బిగినింగ్ ను దృష్టిలో వుంచుకుని, దానికి వచ్చిన క్రేజ్ ను అంచనా గా తీసుకుని బాహుబలి 2 పబ్లిసిటి ప్లాన్ చేస్తున్నారు యూనిట్.ఇందులో భాగంగా బాహుబలి ది కంక్లూజన్ ఆడియో,ట్రైలర్ లాంచ్ వేడుకకు సంబంధించిన ప్రణాళిక జరుగుతుంది.

పబ్లిసిటి లో రాజమౌళి బాహుబలి వంటి వాడు.ఎలా చేస్తే సినిమాకు హైప్ వస్తుందో బాగా తెలిసిన వాడు.నిర్మాతలపై కనక వర్షం కురిపించడానికి ఆయన చేసే ప్రయత్నాలు మామూలుగా వుండవు.ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన బాహుబలి2 పోస్టర్ లను విడుదల చేసి ఆసక్తి క్రియేట్ చేసాడు. అలాగే రాజమౌళి త్వరలో బాహుబలి2 ఆడియో వేడుకని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

బాహబలి 2 కి సంబంధించిన బిజినెస్ ప్రమోషన్స్ ని దృష్టిలో పెట్టుకొని బాహుబలి2 థియోట్రికల్ ట్రైలర్ ని ముంబాయ్ లో విడుదల చేస్తే బాగుంటుదని ప్లాన్ చేస్తున్నారు.ఇందుకు కరణ్ జోహార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ థియాట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రభాస్, రానా, రాజమౌళి, తమన్నా, అనుష్క, నిర్మాతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 15న జరగే అవకాశాలున్నాయి. అలాగే త్వరలోనే బాహుబలి2 కి సంబంధించిన ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించనున్నారు.

బాహుబలి 2 రిలీజుకు రెండు నెలలు కూడా లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలపై పూర్తి దృష్టి పెట్టింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీస్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా కరణ్ జోహార్, అమితాబ్ బచ్ఛన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.