అదరగొట్టిన బాహుబలి 2 – ది కంక్లూజన్ ట్రైలర్

” అమరేంద్ర బాహుబలి అను నేను.. అశేషమైన మాహిశ్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా… ప్రాణత్యాగానికైనా వెనకాడబోనని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను…” ఇది దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ థియాట్రికల్ ట్రైలర్‌లో వచ్చిన మొదటి డైలాగ్.
“నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడు పుట్టలేదు మామా..” అని కట్టప్పనుద్దేశించి బాహుబలి అనే రెండో డైలాగ్ ట్రైలర్‌లో జీవం పోసింది.
మొత్తం ట్రైలర్‌ మొత్తం ఇదే స్పీడ్‌తో దదూసుకెళ్ళింది. అదరగొట్టే విజువల్ ఎఫెక్ట్స్‌తో, పేలిపోయే భారీ డైలాగ్స్‌తో ఉన్న ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మొదట తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఉన్న బాహుబలి ట్రైలర్లు దేశవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేసి సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే లీక్ సమస్య మళ్ళీ బాహుబలి టీంకి ఎదురైంది. ఉదయం 8 గంటలకే తమిళం ట్రైలర్‌ను ఎవరో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేశారు. దాంతో తమిళ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. థియేటర్లలో విడుదలకు ముందే వైరల్ అవ్వడంతో తప్పని పరిస్థితుల్లో యూట్యూబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేసేసింది బాహుబలి టీం.
మొదట ఒక నిమిషం 52 సెకన్ల నిడివి కలిగిన తమిళ ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో బయటకొచ్చింది. ఆ తర్వాత రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగిన హిందీ ట్రైలర్‌ను కరణ్‌ జోహర్‌ ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. తెలుగులోనూ 02 నిమిషాల 24 సెకన్ల ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ మైండ్‌ బ్లోయింగ్‌ వీఎఫ్‌ఎక్స్‌తో  రూపుదిద్దుకుంది.
 బాహుబలి-2లో ప్రభాస్‌, రానాలు ఈ సినిమాలో హీరో, విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, తమన్నాలు హీరోయిన్లు. ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
రమ్యకృష్ణ కాలిని ఎవరో తాకుతున్నట్లు మొదలైన ట్రైలర్‌.. బాహుబలిని కట్టప్ప పొడిచి చంపడం.. శివగామి మహేంద్లాంర బాహుబలి అని గట్టిగా అరిచి ప్రజలకు చూపించడంవంటి ఉత్కంఠ భరిత సీన్లతో ముందుకు సాగింది. అయితే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నను పొడిగిస్తూ.. ప్రశ్నార్ధకంగానే ఉంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.