రికార్డులు తిరగరాస్తున్న బాహుబలి2

Baahubali2 creates records on Day1 with More than 100 crores collections

Baahubali2 creates records on Day1 with More than 100 crores collections

రెండేళ్ళుగా సినీ ప్రేమికులను ఊరించి థియేటర్స్‌లోకి అడుగుపెట్టిన బాహుబలి2 మొదటి షో నుండే రికార్డులను తిరగ రాస్తున్నాడు. బాహుబలితో ఏమాత్రం పోలికలేకుండా తీసి అందరినీ ఆకట్టుకోగలిగాడు రాజమౌళి. 2గంటల 50 నిమిషాల సినిమాను పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో గురువారం రాత్రి నుంచి బాహుబలి కలెక్షన్ల వేట మొదలైనా.. అఫీషియల్‌గా శుక్రవారం ఎర్లీ మార్నింగ్ షోతో బాహుబలి హవా మొదలైంది. అందరికీ షాక్ ఇస్తూ తొలి 24 గంటల్లో కేవలం భారత మార్కెట్ లోనే బాహుబలి2 ఏకంగా 125 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది.

దక్షిణభారతదేశంలో వందకోట్ల వసూళ్లు ఫుల్ రన్‌లో సాధించటమే కష్టంగా ఉన్న రోజుల్లో.. తొలి రోజే 125 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆల్ టైం రికార్డ్‌ను సెట్ చేసింది. ఇప్పటికే బాలీవుడ్ రికార్డ్ లను కూడా బద్దలు కొట్టడం ప్రారంభించిన ఈ భారీ చిత్రం, ఫుల్ రన్‌లో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం కాయం అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు.

24గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు, హిందీలో 38 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, కేరళలో 9 కోట్లు, తమిళనాట 11 కోట్ల వసూళ్లు సాధించినట్టుగా  అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఓవర్ సీస్ కలెక్షన్లు కూడా కలుపుకుంటే తొలి రోజే 150 కోట్ల మార్క్ కు బాహుబలి 2 చేరువైనట్టే. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన 24గంటల్లో 36 కోట్లు సాధించిన బాహుబలి-2 ఆల్రెడీ ఇప్పటివరకూ ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్‌నీ బ్రేక్ చేసింది. దంగల్, సుల్తాన్ సినిమాల రికార్డ్స్‌ని భారీ మార్జిన్‌తో బ్రేక్ చేసి పడేసిన బాహుబలి-2 కలెక్షన్స్ ఏ స్థాయిలో ఆగుతాయో కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు. ప్రభాస్ యాక్టింగ్‌కి కూడా ఇండియన్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

 

బాహుబలి-2 మూవీ రివ్యూ

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.