బాబ్రీ కేసులో ఊరట

Babri case BJP Seniors exempted from personal appearance in court

Babri case BJP Seniors exempted from personal appearance in court

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేతలకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఊరట కలిగించింది. ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్‌ జోషిలతో పాటు ఉమాభారతిలను ఈ కేసు విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు వీరికి బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ, కేసు నమోదు చేయొద్దంటూ దాఖలైన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేగాక అద్వానీ సహా మురళీ మనోహర్ జోషీ, ఉమా భారతిలపై కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది.

అయితే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు లభించడంతో కేసు విచారణ సందర్భంగా వాయిదాలకు సీనియర్ నేతలు లక్నో వరకు రావాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే నిందితులపై ఇప్పటికే జాతీయ సమైక్యతకు హాని కలిగించడం, ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేయడం, ఉద్దేశపూర్వకంగా మతపరమైన భావాలను దెబ్బతీయడం, బహిరంగ అల్లర్లకు దారితీసేలా ప్రకటనలు చేయడం,  అల్లర్లు చేయడం తదితర అభియోగాలు ఉన్నాయి.

వీటికి అదనంగా కోర్టు నేరపూరిత కుట్ర అభియోగాన్ని కూడా మోపింది. నేరం రుజువైతే నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని కోర్టులో ఈ కేసు విచారణను పరిశీలిస్తున్న ఓ న్యాయవాది తెలిపారు. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేశారు. మసీదు ప్రాంతంలో రామమందిర ఉందని ఒక వర్గం, ఇక్కడ మసీదే ఉందని మరో వర్గం వాదించుకుంటుండడంతో ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.