బాబ్రీ కేసు: సిబిఐ పునర్విచారణకు సుప్రీం అనుమతి

Babri case Supreme Court restores criminal conspiracy Trial Against Advani, Joshi, Uma Bharti and Blow to Advani

 

Babri case Supreme Court restores criminal conspiracy Trial Against Advani, Joshi, Uma Bharti and Blow to Advani

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేతలు ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీలకు విముక్తి లభించేలా కనిపించట్లేదు. గతంలో అలహాబాద్ కోర్టు కొట్టేసిన కేసును కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిబిఐ మళ్ళీ తిరగదోడింది. దీంతో కేసు విచారణ చేపట్టాలని సిబిఐ కోర్టు గడప దొక్కింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కేంద్రప్రభుత్వం కనుసన్నలోనే జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

అంతేగాక రాష్ట్రపతి రేసులో బిజెపి వృద్ధనాయకులు ఉండకుండా పక్కకు తప్పించాలంటే బాబ్రీ కేసుని తిరగదోడడం తప్ప వేరే మార్గం ఏదీ కనిపించనట్లుంది బిజెపి అధినాయకత్వానికి. అందుకే మోడీ సర్కార్ పురమాయింపుతో సిబిఐ రంగంలోకి దిగింది.

దారులు తెరుచుకున్నాయనుకొని సంబరపడుతుంటే సుప్రీంలో సిబిఐ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ పీసీ ఘోష్‌, ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌లతో కూడిన ధర్మాసనం బిజెపి నేతలపై కేసుల పునరుద్ధరణకు అనుమతినిచ్చింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్‌ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే బాబ్రీమసీదు కూల్చివేత కుట్ర కేసుల ఉపసంహరణను సవాల్‌ చేస్తూ దివంగత హామీమహబూబ్‌అహ్మద్‌, సిబిఐ దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ నెల 7న ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. బాబ్రీ కూల్చివేత కేసులో బిజెపి నాయకులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నట్లు సీబీఐ న్యాయస్థానంలో వాదించింది. బాబ్రీ ఘటనకు ముందు సమీపంలోని ఒక వేదికపై బిజెపి నాయకులు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసినట్లు ధర్మాసనానికి తెలియచేసింది సిబిఐ.

బిజెపి ప్రసంగాలతో రెచ్చిపోయిన కరసేవకులు మసీదును కూల్చివేశారని ఆరోపిస్తోంది. బిజెపి నాయకులతో సహా పలువురిపై కేవలం సాంకేతిక కారణాలతోనే అలహాబాద్‌ న్యాయస్థానం కేసును తొలగించిందని సీబీఐ పేర్కొంది. ఇదంతా కుట్రపూరితంగానే జరిగినట్లు సీబీఐ చెబుతోంది.

అద్వానీతో సహా 20 మందిపై 153(ఎ) 153(బి) , 505 అభియోగాలను ఛార్జిషీట్‌లో మోపింది సిబిఐ. అయితే అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌‌సింగ్‌ రాజ్యాంగపరమైన రక్షణలో ఉన్నందున ఆయనపై కేసు నమోదు చేయలేదు సిబిఐ.

శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిరం నిర్మించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. మసీదు ఉన్న స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.