బాబ్రీ కేసు: అద్వానీతో సహా 12 మందికి బెయిల్ మంజూరు

Babri Masjid case: Advani, Joshi, Bharti and other accused granted bail

Babri Masjid case: Advani, Joshi, Bharti and other accused granted bail

లక్నో: బాబ్రీ కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో పాటు 12 మందికి లక్నో సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అద్వానీ సహా 13 మంది బీజేపీ నేతలపై కుట్ర అభియోగాలను ప్రత్యేక కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు తీర్పును అలహాబాద్‌ హైకోర్టు సైతం సమర్థించింది. అయితే ఈ క్రమంలో సీబీఐ ఈ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో బాబ్రీ మసీదు కేసు విచారణను చేపట్టింది.

కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అద్వానీ సహా నిందితులందరి తరఫున గతంలో దాఖలైన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. అద్వానీ సహా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేయడంతో వారు మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

25 ఏళ్లనాటి మసీదు విధ్వంసం కేసులో బీజేపీ ముఖ్యనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి, సాథ్వి రీతాంబరా, వినయ్‌ కటియార్‌, వీహెచ్‌పీ నేత విష్ణు హరి దాల్మియా, మహంత్‌ రాంవిలాస్‌ వేదాంతి, మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌, వైకుంఠలాల్‌ శర్మ, ధర్మ దాస్‌, చంపత్‌రాయ్‌ బన్సల్‌, శివసేనకు చెందిన సతీశ్‌ ప్రధాన్‌ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఉన్నతన్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో వీరిపై విచారణ ప్రారంభమైంది. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదుచేశారు. అనంతరం వారందరికీ బెయిల్‌ మంజూరుచేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.