బీజేపీ అగ్రనేతలకు వణుకు తెప్పిస్తున్న కోర్టు ఆదేశాలు

babri-masjid-case-hurdles-started-against-advani-joshi-uma-bharathi

babri-masjid-case-hurdles-started-against-advani-joshi-uma-bharathi

అధికారంలో ఉన్న పార్టీకి చెందిన గల్లీ నాయకుడి నుండి ఢిల్లీ నాయకుడి వరకు అందరూ తమ హవా కొనసాగిస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్ర నాయకులకు మాత్రం మనశ్శాంతి కరువైంది. ఎప్పుడో 25ఏళ్ళ క్రితం జరిగిన బాబ్రీ మసీదు ఘటనలో ఇప్పటికీ ఏం జరుగుతుందన్న భయం బీజేపీ అగ్రనాయకులకు భయ పెడ్తోంది. అంతేగాక సీబీఐ కేసు రీఓపెన్ చేసిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి.

కేసు విచారణలో భాగంగా ఈనెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో అద్వానీ, మురళీమనోహర్‌జోషి, ఉమాభారతిలపై అభియోగాలను అదేరోజు నమోదు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికితోడు కుట్ర అభియోగాలను నమోదు చేస్తే మంత్రిగా ఉన్న ఉమాభారతి ఆ పదవిలో కొనసాగుతారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.

అద్వానీతో పాటు కుట్ర ఎదుర్కొంటున్నవారంతా కోర్టుకు హాజరు కావాలని  సీబీఐ ప్రత్యేన న్యాయస్థానం ఆదేశించడంతో కేసులో ఉత్కంఠ మరింత పెరిగింది. అద్వానీ, ఉమా భారతి, వినయ్ కటియార్, మరళీ మనోహర్ జోషి సహా 14 మంది కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టుకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అద్వానీ సహా నిందితులందరి తరఫున దాఖలైన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

అద్వానీ సహా బీజేపీ సీనియర్‌ నేత మురళీమనోహర్‌ జోషి, కేంద్రమంత్రి ఉమాభారతి ఈ నెల 30న కోర్టుకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ముగ్గురు నేతలు క్రిమినల్‌ కుట్రకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిపై మరిన్ని అభియోగాలను కోర్టు మోపే అవకాశముందని భావిస్తున్నారు. 2001లో సీబీఐ కోర్టు క్రిమినల్‌ కుట్ర అభియోగాల నుంచి ఈ ముగ్గురు నేతలకు విముక్తి కల్పించింది. ఈ తీర్పును అలహాబాద్‌ హైకోర్టు ఏడేళ్ల కిందట సమర్థించగా.. తాజాగా సుప్రీంకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతిలపై అభియోగాల ఎత్తివేత కుదరదని, ఈ అభియోగాలపై విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈనెల 30న కోర్టుకు హాజరైన సందర్భంగా వారిపై కుట్ర అభియోగాలు నమోదు అయితే అధికారపక్షానికి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.

అయితే రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్న కల్యాణ్ సింగ్‌కు ప్రస్తుతానికి మినహాయింపు లభించింది. గవర్నర్‌గా పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనపై విచారణ కొనసాగుతోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.