“అక్కడ మాత్రం” బాహుబలి 2 విడుదల డౌటే???

baahubali 2 ban row pro kannada organisations demanding apology from satyaraj and Rajamouli says turning anger on bahubali 2 is not correct
 baahubali 2 ban row pro kannada organisations demanding apology from satyaraj and Rajamouli says turning anger on bahubali 2 is not correct
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన ద‌ృశ్యకావ్యం బాహుబలికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా బాహుబలి2. ఈనెల 278న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్న బాహుబలి2కి అన్నిచోట్ల స్వాగత తోరణాలు కనిపిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించి బాలీవుడ్‌లోనూ ఘన స్వాగతం లభిస్తుంటే ఒక్క దగ్గర మాత్రం సినిమా విడుదలకు స్పీడ్ బ్రేకర్లు కనిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలమధ్య ఉన్న సమస్యను ఈ సినిమాకి అంటగడుతూ అడ్డుకుంటామని హెచ్చరించడంతో పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డాడు రాజమౌళి.
తొమ్మిదేళ్ళ క్రితం కావేరీ జలాల విషయంలో తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కన్నడిగులు ఈసారి ఎందుకో బాహుబలి 2 విడుదలపై సీరియస్‌గా ఉన్నారు. సత్యరాజ్ నటించాడన్న కారణంతో బాహుబలి2 సినిమా విడుదలను కర్ణాటకలో అడ్డుకుంటామని చెప్పడం ఎతంవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు దర్శకుడు రాజమౌళి. కన్నడిగుల సమస్యతో తమ సినిమాకు సంబంధం లేదని రాజమౌళి స్పష్టం చేశారు.
బాహుబలి సినిమాలో నటించిన సత్యరాజ్ బాహుబలి సినిమాకు దర్శకుడో, నిర్మాతో కాదని అయినా తొమ్మిదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు, ఈ సినిమాకు ముడిపెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయని, ఆఖరికి బాహుబలి సినిమా కూడా విడుదలయిందని.. మరి బాహుబలి2 విడుదలకే ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావడం లేదని రాజమౌళి అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.