బాహుబలి 2 ఎఫెక్ట్: ఎపిలో 6, తెలంగాణాలో 5షోలకు ఓకె

Bahubali 2 Effect AP Govt Allows 6 Telangana Govt Allows 5 Shows Daily

Bahubali 2 Effect AP Govt Allows 6 Telangana Govt Allows 5 Shows Daily

బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో హీట్ పెరుగుతోంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకునేందుకు జనం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల సస్పెన్స్‌కు తెరదించేందుకు ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు ఉన్న ఈ విపరీతమైన క్రేజ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అదనపు షోలకు ఓకె చెప్పేశాయి.

ప్రస్తుతం సాధారణంగా రోజూ నాలుగు షోలు మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తుండగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 సినిమాను తొలి పది రోజుల పాటు ఉదయం 7 గంటల నుంచి అర్ధరాత్రి 2.30 వరకు మొత్తం 6 షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సినిమాకు ఉన్న క్రేజ్‌ను బ్లాక్ మార్కెట్ మాఫియా క్యాష్ చేసుకోకుండా ఉండేందుకు హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ షోలకు కూడా వినోదపు పన్ను కట్టాలని సూచించారు.

మరోవైపు తెలంగాణాలో బాహుబలి 2 సినిమాకి రోజుకు ఐదు షోలకు అనుమతివ్వడంతో పాటు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.సినిమా విడుదల నేపథ్యంలో ప్రత్యేక ప్రదర్శనకు ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన బాహుబలికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని… నిర్మాతలు కోరిన మినహాయింపులు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు తలసాని. సినిమా థియేటర్లలో ఆహార పదార్థాల ధరలను నియంత్రించడంతో పాటు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంచేశారు.

అయితే ఎపిలో ఆరు షలోకు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఆరు షోలుే వేయడం చట్ట విరుద్ధమంటూ సినీ ప్రేక్షకుల సంఘం విజయవాడలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసారు. ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు సినీ ప్రేక్షకుల సంఘం ప్రతినిధులు.

అయితే పాత రికార్డులను తిరగరాస్తూ బాహుబలి2 బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ అవ్వడంతోపాటు సుమారు వెయ్యి కోట్లకు పైగా వసూళ్ళు చేస్తుందనే టార్గెట్ ఉందని టాక్ వినిపిస్తోంది.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.