కర్ణాటకలో బాహుబలి2 విడుదలకు లైన్ క్లియర్

Bahubali 2 release in Karnataka confirmed after Actor Sathyaraj apologises to kannadigas about kaveri issue comments

Bahubali 2 release in Karnataka confirmed after Actor Sathyaraj apologises to kannadigas about kaveri issue comments

గత కొన్ని రోజులుగా బాహుబలి 2 విడుదలకు సంబంధించి కమ్ముకున్న నీలిమేఘాలు తొలగిపోయాయి. కావేరీ నదీ వివాదం విషయంలో నటుడు సత్యరాజ్ కొన్నేళ్ళ క్రితం చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కన్నడిగ సంఘాలు బాహుబలి 2 ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. సత్యరాజ్ క్షమాపణలు చెప్తే తప్ప సినిమా విడుదలకు ఓకె అనే ప్రస్తక్తేలేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో నటుడు సత్యరాజ్ మెట్టు దిగి క్షమాపణలు కోరారు.

kattappa baahubali satyaraj Apologise To Kannadigas

“తాను కన్నడ ప్రజలకు వ్యతిరేకం కాదని, వివాదానికి ముగింపు పలకాలని కన్నడ ప్రేక్షకులకు సత్యరాజ్ విజ్ఞప్తి చేసారు. కావేరి ఉద్యమ సమయంలో రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్నారు. కర్ణాటకలో కొందరు నటులు ఆవేశంగా మాట్లాడంతో ఆ వ్యాఖ్యలు చేయల్సి వచ్చిందన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కన్నడీకులకు మనసు గాయపడితే క్షమించమని కోరారు. ఈ నా వ్యాఖ్యలు సినిమా విడుదలకు అడ్డంకి కాకూడదని“ సత్యరాజ్ కోరారు.

సత్యరాజ్ క్షమాపణలతో వెనక్కి తగ్గిన కన్నడ సంఘాలు కర్ణాటకలో బాహుబలి 2 విడుదలకు లైన్ క్లియర్ చేశారు. అయితే మరోసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కన్నడ ప్రజలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని షరతు విధించారు. దీంతో సినిమా విడుదలకు రంగం సిద్ధమవ్వడంతో బాహుబలి టీం ఊపరి పీల్చుకుంటోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.