రాజమౌళి ఆవేదనకు కారణం అదేనా??

bahubali-director-rajamouli-congratulated-telangana-cyber-crime-police-for-arresting-piracy-gang-which-was-arrested-in-bihar

bahubali-director-rajamouli-congratulated-telangana-cyber-crime-police-for-arresting-piracy-gang-which-was-arrested-in-bihar

బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించకున్న దర్శకుడు రాజమౌళి. బాహుబలి రెండు భాగాలు యమ క్రేజ్ సంపాదించుకొని రెండో పార్ట్ ఇప్పుడు 1500 కోట్లకు పైగా వసూలు చేసింది. నార్మల్‌గా అయితే ఓ సినిమా హిట్ అయితేనే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ, సంతోషంగా వెకేషన్లకు వెళ్తుంటారు మనోళ్ళు. అయితే బాహుబలి 2 లాంటి  బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్‌కు ముందు నుండి ఈరోజు వరకు కూడా సక్సెస్‌ను ఎంజాయ్ చెయ్యకుండాకొద్ది రోజులుగా అసహనంతో పోలీసుల చుట్టూ తిరిగుతున్నారు బాహుబలి దర్శక నిర్మాతలు.

పైరసీ చేస్తూ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నవాళ్ళని పట్టుకోవాలని పోలీసులను కోరడంతో రంగంలోకి దిగిన తెలంగాణా సైబర్ క్రైం విభాగం పోలీసులు బాహుబలి-2 చిత్ర పైరసీలో ఇటీవల నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు పురోగతిని తెలుసుకోవడానికి సైబర్ క్రైం ఆఫీసుకి వచ్చిన రాజమౌళి పోలీసులతో చర్చలు జరిపారు.

పోలీసులతో చర్చల తర్వాత సైబర్ క్రైం పోలీసుల పనితీరుని మెచ్చుకున్న రాజమౌళి కొన్ని విషయాల గురించి ఎంతో ఆవేదనతో మాట్లాడారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సినిమాలను పైరసీ చేస్తూనే ఉన్నారని, సినిమాల పైరసీకి పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు విధించాలని పోలీసులను కోరారు రాజమౌళి. సైబర్‌క్రైం పోలీసులు బీహార్‌లోని బిగుసరాయ్‌లో పైరసీ నిందితులు ఆరుగురిని పట్టుకున్నారని రాజమౌళి తెలిపారు. అయితే నిందితుల అరెస్ట్‌కు బీహార్ స్థానిక పోలీసులు ఏమాత్రం సహకరించలేదన్నారు. తెలంగాణా రాష్ట్ర పోలీసులతోనే పైరసీ నిందితులను పట్టుకున్నట్లు స్పష్టంచేశారు.

సినిమాల్లో కొత్త కొత్త టెక్నాలజీలు వాడుతున్నట్లే పైరసీ చేసే వాళ్లు కూడా కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నారని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు మారుమూల థియేటర్లలో క్యామ్ కాడర్స్ పెట్టి అర్థరాత్రి రికార్డ్ చేసే వారు. ‘ఈగ’ టైంలో అలా జరిగితే చిత్తూరు జిల్లాలో ఓ థియేటర్ ను క్లోజ్ చేయించాం. అలా పైరసీ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రతలన్నీ తీసుకుంటున్నాం. నిందితులు నేరుగా సర్వర్‌కు కనెక్ట్ చేసి మూవీని పైరసీ చేస్తున్నారని, ఆ తర్వాత నిందితులు డబ్బు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే సినిమాను నెట్‌లో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పోలీసులకు సినీ పరిశ్రమ, ఆర్కా మీడియా తరపున రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.