ఆకట్టుకుంటున్న కట్టప్ప ఫస్ట్‌లుక్

సమ్మర్ సీజన్‌లో భారతీయ చలనచిత్ర అభిమానులను ఉర్రూతలూగించడానికి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా బాహుబలి2. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్, రాణా ముఖ్యపాత్రల్లో తెలరకెక్కిన ‘బాహుబలి’ మొదటి భాగం అనూహ్య విజయం సాధించడం కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న దానిపై గత రెండేళ్ళుగా చర్చ పెద్ద ఎత్తున జరగడంతో రెండో భాగం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కట్టప్ప చిన్నప్పటి బాహుబలిని ఆడిస్తున్నట్టు ఒక స్టిల్, దాని కిందే యుద్ధంలో బాహుబలిని కట్టప్పే చంపుతున్నట్టు మరొక స్టిల్ ఉన్నాయి. ఆ పోస్టర్ చూస్తుంటే చిక్కు ప్రశ్న చిత్ర రూపం దాల్చి కళ్ళ ముందు ఆవిష్కృతమైనట్టు అనిపిస్తోంది. ఆ పోస్టర్ తో పాటే రాజమౌళి ‘కట్టప్ప పెంచిన బాలుడు.. కట్టప్ప చంపిన వ్యక్తి’ అంటూ ఒక తీవ్రమైన ట్వీట్ కూడా వేశాడు. ఫుల్ క్రేజ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబందించిన  ట్రైలర్ మార్చి 16న రిలీజవుతుంది.  16వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల మధ్యలో ఏపి, తెలంగాణాల్లోని థియేటర్లలో ట్రైలర్ ను ప్రదర్శించి సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తారని టాక్.

 

సుమారు రూ. 240 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సెకండ్ పార్ట్  ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈనెల 26న రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందని అంటున్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.