బాలకృష్ణ -పూరీ జగన్నాధ్ క్రేజీ మూవీ షురూ

 

టాలీవుడ్ లో క్రేజీగా మారిన కాంబినేషన్స్ లో పూరీ జగన్నాధ్ – బాలకృష్ణ జోడి  ఒకటి. అలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న బాలయ్య 101 సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని తులసీవనంలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగాయి.

భవ్య క్రియేషన్స్ బ్యానర్‌లో వీ.ఆనంద్‌ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో తొలి స‌న్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్ట‌గా, నంద‌మూరి రామ‌కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి రికార్డులను తిరగరాయడంతో పూరీ జగన్నాథ్  బాలయ్య సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. భారీ డైలాగ్స్ చెప్పే బాలకృష్ణ, చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ రాసే పూరీ తన స్టైల్‌‌ని ఈ సినిమా కోసం ఏరకంగా మార్చుకొని ముందుకెళ్తాడన్నదానిపై చర్చ జరుగుతోంది.  షూటింగ్ మార్చి 9న ప్రారంభమవుతుందని, సినిమా సెప్టెంబర్ 29న విడుదల అవుతుందని మహాశివరాత్రి రోజే ఈ సినిమా వివరాలను ప్రకటించారు పూరీ జగన్నాథ్.

నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ `ఆధ్యాత్మిక చింత‌న ఉన్న వి.ఆనంద్ ప్ర‌సాద్‌గారి నిర్మాణంలో పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అంద‌రూ నా 101వ సినిమా ఏదై ఉంటుంద‌ని ఎదురుచూస్తున్న త‌రుణంలో ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. అభిమానులు, ప్రేక్ష‌కులు కోరుకునేలా సినిమా ఉంటుంది.’అన్నారు.

వి.ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ`మా బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.8గా నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు హీరోగా, పూరిగారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది. మా బ్యాన‌ర్‌కు క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నెల 16 నుండి ఏక‌ధాటిగా షూటింగ్ చేస్తాం. సెప్టెంబ‌ర్ 29న సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌డానికి ముందుగానే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అంద‌రూ అంటున్నారు’అన్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ ‘ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్న త‌రుణ‌మిది. ఎప్ప‌టి నుండో బాల‌కృష్ణ‌గారితో ఎప్ప‌టి నుండో సినిమా చేయాల‌నే ల‌క్ష్యం ఈ సినిమాతో నేర‌వేరింది. అభిమానులు బాల‌కృష్ణ‌గారి నుండి ఏ ఎలిమెంట్స్‌ను ఆశిస్తారో, అలా ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌, లుక్ ఉంటుంది. అనుకున్న డేట్ క‌న్నా ఒక‌ట్రెండు రోజుల ముందే సినిమాను విడుద‌ల చేయ‌డానికి సిద్ధంగానే ఉంటాం’ అన్నారు.

అయితే ఈ సినిమా కోసం పూరీకి ఇష్టమైన ఫారిన్ లొకేషన్ బ్యాంకాక్‌లో కాకుండా ఇంగ్లండ్‌లో పిక్చరైజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారట. కొంత భాగం.. పాటలు మినహాయిస్తే దాదాపుగా సినిమా అంతా ఇక్కడే సాగనుందని టాక్. స్టోరీ బేస్ కూడా ఇంగ్లండ్ దే ఉంటుందిట. అలాగే అక్కడి లొకేషన్స్ కూడా ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతాయంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.