బాబాయ్ – అబ్బాయ్ మధ్య గొడవ సద్దుమణగలేదా??

Balayya comments confirms that Jr. NTR, Balakrishna War Continues after settlements

Balayya comments confirms that Jr. NTR, Balakrishna War Continues after settlements

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ అటు తెలుగు తమ్ముళ్ళలోనూ ఇటు నందమూరి ఫ్యామిలీలోనూ రేపిన చిచ్చు కొనసాగుతోంది. మంత్రిపదవులు రాలేదని సీనియర్ నాయకులు బహిరంగంగా పార్టీపై విమర్శలు చేస్తుంటే మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, యంగ్ హీరో ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు బయటపడ్డాయి. లోకేష్ ప్రమాణ స్వీకారానికి నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరవగా ఒక్క ఎన్టీఆర్ మాత్రమే డుమ్మా కొట్టాడు. ఈ విషయాన్ని బాలయ్య సీరియస్‌గానే తీసుకున్నారట. అయితే అక్కడికి వచ్చిన అన్న హరిక‌ృష్ణ చుట్టూనే తిరిగి ఆయన పక్కన కూర్చున్న వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడిని బాలయ్య ఒక్కసారి కూడా పలకరింపుగానైనా అన్న హరిక‌ృష్ణవైపు చూడకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.

గత కొన్నేళ్ళుగా బాలయ్యకు జూ.ఎన్టీఆర్‌కు మధ్య పొసగట్లేదని, సత్సంబంధాలు ఏమాత్రంలేవనే విషయం దాదాపు తెలుగు ప్రజలు అందరికీ తెలిసిందే. గతంలో అందరూ కలిసి ఉన్నప్పటికీ కొన్నేళ్ళుగా రెండు కుటుంబాల మధ్య వచ్చిన విబేధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2009లో టీడీపీ తరుపున వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.  అప్పటివరకు చంద్రబాబు తర్వాత పార్టీ నాయకత్వాన్ని చూసుకొనే ఒకే ఒక్కడు జూ.ఎన్టీఆరేనని అందరూ అనుకున్నారు. ఎన్టీఆర్ సైతం ఎటువంటి శక్తివంచనలేకుండా పార్టీకి సేవ చేశాడు.

NTR Roadshow

అయితే తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మార్పులు జరగడం మొదలయ్యాయి. అప్పటివరకు చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆసక్తిగాలేకపోవడం వల్ల ఎన్టీఆర్ నాయకత్వం కొనసాగింది. అయితే ఎప్పుడైతే లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు చంద్రబాబు, కూతురిని ఇచ్చిన మామ బాలక‌ృష్ణ ప్రోద్బలంతో లోకేష్ హవా పెరగడం మొదలైంది. అంతేగాక అప్పటినుండి లోకేష్ కూడా పార్టీ వ్యవహారాల్లో తలదూర్చి మెలుగుతుండడంతో తప్పనిపరిస్థితుల్లో జూ.ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం నెమ్మదినెమ్మదిగా ప్రారంభించాడు. దీనికి కొనసాగింపుగా టీడీపీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన 2014 ఎన్నికల సమయంలో జూ.ఎన్టీఆర్ అసలు పార్టీ వ్యవహారాలవైపు మొహం తిప్పి చూడలేదని, అదేసమయంలో లోకేష్ టీడీపీకి స్టార్ క్యాంపెయినర్‌గా అవతారమెత్తాడు.

Lokesh balakrishna

ఇటువైపు ఎన్టీఆర్ సైతం తన వ్యవహారమేదో తాను చూసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. ఆ తర్వాత గతేడాది సంక్రాంతి సమయంలో డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాల విడుదల సమయంలో అభిప్రాయబేధాలు బయటపడ్డాయి. డిక్టేటర్ ప్లాటినం డిస్క్ వేడుకలో బాలయ్య, డైరెక్టర్ శ్రీవాస్ చేసిన కామెంట్స్ జూ.ఎన్టీఆర్ అభిమానులను టార్గెట్ చేశాయి. అదే సమయంలో ఎన్టీఆర్ తండ్రి హరిక‌ృష్ణ రాజ్యసభ సభ్యత్వాన్ని పొడగించడంలో బాలక‌ృష్ణ, లోకేష్‌లు ఇద్దరే అడ్డుపుల్ల వేశారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల కూడా బాబాయ్ – అబ్బాయ్‌ల మధ్య విబేధాలు ఎక్కువయ్యాయని టాక్.

అలా మొదలైన విబేధాలు నేటికీ కొనసాగుతున్నాయని బాలకృష్ణ లేటెస్ట్ కామెంట్స్‌తో అర్థమౌతోంది. నారాలోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పడు సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఒక్క జూ.ఎన్టీఆర్ తప్ప. ఇదే విషయాన్ని బాలక‌ృష్ణని అడిగితే ఏమన్నారో చదివితే పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థమౌతుంది. ” అది ఎవరినీ అడిగే పనిలేదండీ. ఎవరి వ్యక్తిగత విషయం. ఎవరికీ బొట్టుపెట్టి పిలిచే పెళ్ళి కాదు కదండీ. ఎవరికి వాళ్ళు… వాళ్ళుగా వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, పార్టీని దృష్టిలో పెట్టుకొని మెలగాలి అంతే. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే అవకాశం ఉంటుంది. అది ఆయన వ్యక్తిగత విషయం’ అంటూ జూ.ఎన్టీఆర్‌కు చురకలంటించారు బాలయ్య.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.