బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి

Beautician suspicious death creats buzz in Film Nagar

అందరినీ అందంగా తయారుచేసే బ్యూటీషియన్ అర్ధాంతరంగా ప్రాణాలు వదిలేసింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లోని ఆర్‌జె ఫోటోగ్రఫీలో బ్యూటీషియన్‌గా, హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్న అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్‌ శిరీష (28) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. శ్రీకృష్ణానగర్‌లో నివసించే శిరీష సోమవారం రాత్రి 8గంటల 40నిమిషాలకు తన భర్త సతీష్‌చంద్రకు ఫోన్‌చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు.

Beautician suspicious death creats buzz in Film Nagar

దీంతో ఎప్పటిలాగానే సతీష్‌ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను పనిచేసే ఆశ్రయ్‌–ఆకృతి పాఠశాలకు వెళ్ళారు. అయితే అతను స్కూల్‌కి వెళ్ళిన తర్వాత సతీష్‌చంద్రకు బంజారాహిల్స్‌ పోలీసులు ఫోన్‌చేసి ఫిలింనగర్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ ఆఫీస్‌కి రావాలని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్ళిన సతీష్‌కు మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. దీంతో ఫోటోగ్రఫీ ఆఫీస్ యజమాని వల్లభనేని రాజీవ్‌ను ఏం జరిగిందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని… తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు.

అయితే తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు. ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి 12 సంవత్సరాల కూతురు ఉంది. అయితే గతంలో రాజీవ్‌ను ప్రేమించే అమ్మాయి శిరీషపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.