పని మనుషులతో జర జాగ్రత్త

beware of the people with maid servents

beware of the people with maid servents

హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని విద్యుత్ నగర్ కాలనిలో నివాసముంటున్న డాక్టర్. ఆర్.సి.వి.శ్రీకాంత్ దంపతుల ఇంటికి కన్నం వేసింది ఓ మహిళ. సుమారు ఇరవై తులాల బంగారు ఆభరణాలు కల్గిన బ్యాగ్ తో ఆ మహిళ ఉడాయించింది. పోలీసులు 24 గంటల లోపే కేసును ఛేదించి ఘటనకు పాల్పడినవారిని అరెస్టు చేశారు.

28 సంవత్సరాల అనిత బాయ్ శ్రీకాంత్ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నది. రోజూ లాగానే శనివారం కూడా పనిచేస్తున్న సమయంలో శ్రీకాంత్ దంపతులు బయటకు వెళ్లారు. తిరిగి వచ్చిన వైద్య దంపతులకు ఇంట్లో పని మనిషి లేక పోవడంతో అనుమానం వచ్చి ఇంట్లో ఆభరణాలు కల్గిన బ్యాగ్ లేకపోవడంతో వెంటనే స్థానిక చైతన్య పురి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసునమోదు చేసి రంగంలోకి దిగారు. ఇరవై నాలుగు గంటల లోపే కేసును ఛేదించి పనిమనిషి ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

పోలీసులు ఆమెవద్ద సుమారు ఇరవై తులాల బంగారు ఆభరణాల బ్యాగును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎల్.బి.నగర్ ఏ.సి.పి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ఇంట్లో పనిమనిషులను నియమించుకునేటప్పుడు వారికి సంబందించిన పూర్వపరాలు తెలుసుకొని నియమించుకోవాలని తెలిపారు. కేసును ఇరవై నాలుగు గంటల లోపే ఛేదించిన సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.