వంట మనిషి ఇలా అయ్యాడేంటి??

Bike Thief arrested in LB Nagar Police Limits Hydearbad

అందరికి వంటమనిషిగా పరిచయమైన ఓ వ్యక్తి మరికొంతమందికి మంట మనిషిగా తయారయ్యాడు. గత రెండేళ్ళుగా పోలీసుల కళ్ళుగప్పి ‘ద్విచక్రవాహనాల దొంగతనాలకు’ పాల్పడుతున్న బైక్ దొంగకు  చైతన్యపురి క్రైం పోలీసులు శుభం పలికారు.

Bike Thief arrested in LB Nagar Police Limits Hydearbad

వాహనాల తనిఖీల్లో భాగంగా అలకాపురిలో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా ఉన్నఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఎల్.బి.నగర్ గుంటి జంగయ్య కాలని కి చెందిన శివారెడ్డి అనే 39 సంవత్సరాల వ్యక్తి అని ఇతడు గత రెండు సంవత్సరాలుగా బైక్స్‌ను అపహరించిస్తూ జల్సాలకు అలవాటుపడ్డాడని పోలీసులు తెలిపారు. బైక్ దొంగను అదుపులోకి తీసుకొని విచారించగా అతడి దగ్గరినుండి సుమారు ఏడు లక్షల రూపాయల విలువచేసే
పదిహేను బైకులను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు చైతన్యపురి క్రైం పోలీసులు.

See Also: శిరీష, తేజస్విని ఇద్దరినీ వదిలించుకోవాలనుకున్నాడా??

ఇప్పటికే ఈ దొంగపై సరూర్‌నగర్ లిమిట్స్‌లో  ఎనిమిది , చైతన్యపురి లిమిట్స్‌లో ఆరు , ఆదిభట్ల లిమిట్స్‌లో ఒక వాహనాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ , సినిమా హాళ్ళు , కూరగాయల మార్కెట్లో పార్కుచేసిన వాహనాలే ఇతని టార్గెట్ అని ఎల్.బి.నగర్ డిసిపి వెంకటేశ్వరరావు తెలియచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.