కమలనాథులకు ‘సాంబారు’ రాజకీయాలపై ఉన్న ఇంట్రెస్ట్ వీళ్ళపై లేదా??

BJP exhibits its double standards regarding TN issues

BJP exhibits its double standards regarding TN issues

తమిళనాడు రాజకీయాలపై ద‌ృష్టిపెట్టి అక్కడ పాగా వెయ్యాలని  చూస్తున్న కమలనాథులకు అక్కడి ప్రజలు ఢిల్లీలో చేస్తున్న నిరసనలు ఏమాత్రం కనిపించట్లేదా??? అధికారం కోసం ఎలాంటి పంచాయితీలనైనా సెటిల్ చేయగలిగే పటిమ ఉన్న  అమిత్ షాకుగానీ, ప్రధాని మోడీకి గానీ తమిళ రాజకీయాలే కనిపిస్తున్నాయి తప్ప గత నెల రోజులులగా నిరసనలు తెలుపుతున్న రైతులను ఏమాత్రం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.

కరవు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, మద్దతు ధర, రైతు రుణాల మాఫీ చేయాలని కోరుతూ మార్చి 14 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు తమిళ రైతులు. గత 39 రోజులుగా నిరసన తెలుపుతున్న తమిళ రైతులు తమ నిరసన స్థాయిని పెంచేశారు. రోజుకోరకమైన పంథాతో ముందుకు వెళ్తున్న రైతులు ఈరోజు వినూత్న రీతిలో తమ ఆవేదనను ప్రభుత్వం ముందు, ప్రజల ముందు వెళ్ళగక్కారు. నిరసనలో పాల్గొన్న కొందరు రైతులు తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపారు.

BJP exhibits its double standards regarding TN issues

తమిళనాడులో తమకు తాగేందుకు నీళ్లు లేకపోవడం వల్లే ఈ విధంగా నిరసన తెలపాల్సి వచ్చిందని చెబుతున్నారు రైతులు. మొదట్లో పాములు, ఎలుకలను నోట్లో పెట్టుకుని నిరసన తెలపిన రైతులు ఆ తర్వాత మరోసారి పుర్రెలను మెడలో వేసుకొని వూరేగించారు. ఈమధ్య సౌత్‌బ్లాక్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం ముందు పూర్తి నగ్నంగా నడిచి ఆందోళన చేపట్టారు.

మొత్తానికి తమిళ సాంబారు కావాలనుకుంటున్న బిజెపి నాయకులు ఇప్పటికైనా సాంబారులో కలుపుకొనే అన్నాన్ని పండిచే రైతుల కష్టాలపై ద‌ృష్టిపెడితే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది..

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.