ఓడిన 120 లోక్ సభ స్థానాల్లో బిజెపి ప్రచారం షురూ

BJP launches campaign to regain 120 Lok Sabha seats lost in 2014
BJP launches campaign to regain 120 Lok Sabha seats lost in 2014

(పాత చిత్రం)

తొందరగా లేచిన  పిట్టకే  ఆహారం దొరుకుతుందని  సామెత. ఆ మేరకు,  ఇటు  అయిదు రాష్ట్రాల  ఎన్నికలు  ముగిసి మంత్రి వర్గాలు ఏర్పడ్డాయి లేదో,   భారతీయ జనతా పార్టీ,  కార్యవర్గం,  అప్పుడే 2019 పార్లమెంట్ ఎన్నికలపై  దృష్టి పెట్టింది.  2014  లో తాము ఓడిపోయిన  నూటా  ఇరవై    లోక్  సభ స్థానాల్లో, మోడీ ప్రధానమంత్రిగా అమలు జరుపుతున్న అంశాలపై  తమ పార్టీకి చెందిన  హేమా హేమీలు ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంపై  శ్రద్ధ  కేంద్రీకరించి, అక్కడ తమ  విజయాలపై  ప్రజలలో అవగాహన కలిగేలా  ప్రణాళిక  రూపొందించింది. ఇది శ్రీ రామనవమి మరునాడు ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినం కూడా, ఆ రోజు నుంచి మొదలై, అంబెడ్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకూ  కొనసాగుతుంది.

సీనియర్ పార్టీ నాయకులూ, మంత్రులూ, ఈ నియోజకవర్గాలకు వెళ్లాలని, అక్కడ ఉండి స్వయంగా ఈ అవగాహన యాత్రను  జయప్రదం చేయాలనీ  ఆదేశాలు  జారీ అయ్యాయి.  ఈ నియోజక వర్గాల్లో తాము 2014  లో ఒడి పోయినా,  2019 లో తమ గెలుపు అవకాశాలను ఇక్కడ  పునాదులు వేసి బలోపేతం చేసుకునేందుకే,  బి.జె.పీ  ఇంత త్వరగా,  ఇంకా రెండేళ్ల తరువాత  రానున్న  లోక్  సభ  ఎన్నికలకి వ్యూహ రచన చేస్తున్నది.

పార్టీ  తమకు అప్పగించిన ఏ లోక్ సభ  నియోజకవర్గంలో అయినా,  చట్టసభల్లోనుంచి పార్టీ ఎం.పీ.లు ఒక రోజు యాత్రకు వెళ్తారు. ఈ యాత్రలో ప్రధానమంత్రి మోడీ పాల్గొనడం లేదు. విదేశాంగ శాఖ  మంత్రి సుష్మాపై స్వరాజ్ ఈ అవగాహన యాత్ర లో ఆరోగ్య  కారణాల  వల్ల భాగస్వామ్యం  తీసుకోవడం లేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ లోనూ,  రాజ్నాథ్ సింగ్  కలకత్తా దక్షిణం లోనూ,  టెక్స్టైల్స్ మంత్రి స్మ్రితి ఇరానీ కలకత్తా  ఉత్తరం మరియు అమేథీ లోనూ,  అరుణ్ జైట్లీ  బెంగళూరు రూరల్ లోనూ,  నితిన్ గడ్కరీ నిజామాబాద్ లోనూ,  ఉమాభారతి హౌరా లోనూ,  న్యాయవ్యవహారాల శాఖ మంత్రి  రవిశంకర ప్రసాద్ హుగ్ల్లీ లోనూ ఇలా  ప్రముఖుల పర్యటనలు రూపొందించారు.  ఇంకా పార్టీ జనరల్ సెక్రటరీ  భూపేంద్ర యాదవ్, మాదే పురాలో, రామ్ మాధవ్  కరీమ్ గంజ్ లో, కైలాష్ విజయ్ వర్గీయ,  సిల్చార్ లో, అనిల్ జైన్ ఫిరోజాబాద్ లో ఈ ప్రచార పర్వంలో బాధ్యతలు పంచుకుంటున్నారు.

ఈ పర్యటనల్లో,  జి.ఎస్.టి  నేషనల్ కమిషన్  ఫర్  సోషల్లీ  అండ్ ఎడ్యుకేషనల్లీ బెక్వర్డ్ క్లాసెస్  గురించి,  వేలిముద్ర ద్వారా, ఎన్నో బేంక్ తదితర ప్రయోజనాలను పొందే  భీం యాప్ (భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ)  గురించి ప్రధానమైన ఫోకస్ ఉంటుంది. ఈ యాప్ కు  దళిత వర్గాల చైతన్య ప్రేరణ అయిన భారతరత్న బాబాసాహెబ్ భీం రావు అంబెడ్కర్ పేరు తో కలిసేలా “భీం”  (BHIM) అని పేరు పెట్టడంలో కూడా, దళిత వర్గాలను, వారి ఆర్ధిక ప్రయోజనాల విషయంలో  బి.జె.పీ పెద్ద ఎత్తున కృషి చేస్తున్న గుర్తింపు పొందాలనే. ఇందులకు అనుకూలంగా ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో “శక్తి కేంద్ర సమ్మేళనం” పేరిట సభలు ఏర్పాటుచేసి, తద్వారా పార్టీ శ్రేణులను బలోపేతం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రతీ శక్తి కేంద్రంలో ఒక పార్లమెంటు సభ్యుడు ఉంటారు. నియోజకవర్గంలో గల పది బూత్ ల నుంచి పార్టీ కార్యకర్తలు ప్రాతినిధ్యం వహిస్తారు. ఎం.పిలు ఈ సభలనుద్దేశించి అవగాహన ప్రసంగాలు, పార్టీకీ మద్దతు పెరిగేలా స్థానిక నిర్మాణాలు, అలాగే అక్కడే మేధావులతో  సంభాషణ సదస్సులు నిర్వహిస్త్తారు.

వారి ఆలోచనలు ఎలావున్నా భారతీయ జనతా పార్టీ  గెలుపు కోసం  అహర్నిశలు కృషి చేస్తున్న సందర్భంలో, పోటీ గా నిలవవలసిన  ఇతర జాతీయ స్థాయి పార్టీలు  ఏమి చేస్తున్నాయి అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సరైన ప్రతిపక్ష నిర్మాణం ఇప్పుడు భారత దేశంలో ఒక ప్రజాస్వామిక  అవసరం.

రామ తీర్థ

Have something to add? Share it in the comments

Your email address will not be published.