తెలంగాణాలో నిర్బంధం ఎక్కువైందన్న బిజెపి

BJP workers and leaders protest Muslim quota bill in Telanagana

BJP workers and leaders protest Muslim quota bill in Telanagana

తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రిజర్వేషన్ బిల్లు తెలంగాణాలో దుమారం రేపుతోంది. మత రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెబుతూ బిజెపి ఈ రోజు తెలంగాణా వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ వ్యతిరేకతను చాటుకున్నారు. రిజర్వేషన్ బిల్లుతో సభనే కాదు రాష్ట్ర ప్రజలను కూడా సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టించారని అంటున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్.

మతపరమైన రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకమని చెప్పిన లక్ష్మణ్ తమిళనాడు తరహా అని చెబుతున్న సీఎం కేసీఆర్ బీసీ రిజర్వేషన్‌ను 54 శాతానికి ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాటలను సీఎం కేసీఆర్ వక్రీకరించారన్నారు.

ఉద్యమ సమయంలో కంటే ఎక్కువగా నిర్బంధం ఉందని, ఈనెల 20న అన్ని జిల్లాలలో నిరసన దీక్షలు చేస్తామని ఆయన స్పష్టంచేశారు. అంతేగాక ఈనెల 24, 25న దీర్ఘకాలిక పోరాటంపై సమావేశం నిర్వహించనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.