మమతా బెనర్జీ తలకు ’11 లక్షల రివార్డు’

BJYM leader offers 11 lakh rupess bounty on Mamata Banerjee's head

BJYM leader offers 11 lakh rupess bounty on Mamata Banerjee's head

హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా మరో వివాదం తెరపైకి వచ్చింది. కమ్యూనిస్టులకు అడ్డాగా మారిన పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న త‌ృణమోల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా యువ మోర్చా నేత. పశ్చిమ్ బెంగాల్‌ బీర్భమ్ జిల్లాలో హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీని ఏర్పాటుచేశారు నిర్వాహకులు. అయితే పోలీసులు అక్కడ ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని పోలీసులు హుకూం జారీ చేశారు. అయితే నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోకుండా ర్యాలీ ప్రారంభించడానికి ప్రయత్నించడా పోలీసులు అడ్డుకున్నాారు. దీంతో పోలీసులకు, నిర్వాహకుల మధ్య వివాదం జరిగి ఘర్షణ మొదలైంది. అయితే ఘర్షణను అడ్డుకొనేందుకు ర్యాలీలో పాల్గొన్న హనుమాన్ భక్తులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు.

పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో బీజెపీ యువమోర్చా నాయకుడు యోగేశ్ సీఎం మమతాబెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ సీఎం తల నరికి తెచ్చినవారికి 11 లక్షల రివార్డు ఇస్తానంటూ చేసిన ప్రకటన ఇప్పుడు పెద్ద దుమారానికి తెరలేపింది. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి రోజుల్లో భక్తిగా పూజలు, ర్యాలీలు చేసుకుంటామంటే పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు యోగేశ్. సీఎం మమతాబెనర్జీ ముస్లింలకు మాత్రమే మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం తరుపున ఇఫ్తార్ విందులు ఇవ్వడాన్ని తప్పుబట్టాడు . యోగేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పెద్ద దుమారానికి తెరలేపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.