పేర్లు బయటపెట్టాలని ఆందోళన

BJYM protest against drugs case on tollywood celebrities

రెండు తెలుగు రాష్ట్రాలను వణి్కించేస్తున్న డ్రగ్స్ కేసులో నిన్న అనధికారికంగా బయటపడ్డ పేర్లతో పాటు ఈ కేసులో ఉన్న మిగతా సినీ ప్రముఖుల పేర్లను సైతం బయటపెట్టాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నటుడికి ఉన్న పబ్‌లో రేవ్ పార్టీ పేరుతో మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నాయని బీజేవైఎం నేతలు ఆరోపించారు.

BJYM protest against drugs case on tollywood celebrities

మాదక ద్రవ్యాల కేసులో మరి కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారని.. వారి పేర్లు బయటపెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర శాఖ నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టింది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న నటులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక పబ్ నడిపిస్తూ అందులో డ్రగ్స్ సప్లై చేస్తున్న నటుడిపై చర్య తీసుకుని పబ్‌ను మూసి వేయించాల‌ని డిమాండ్ చేశారు బీజేవైఎం నాయకులు.

See Also: పనిచేసిన ప్రచారం – సెలవులు రద్దు

అంతేగాక హుక్కా కేంద్రాలు, పబ్‌లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్సైజ్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.