ఈవారం బాహుబలి మాదే అంటున్న నిర్మాత

Mohanlal Amalapaul starer Blackmoney movie success meet
Mohanlal Amalapaul starer Blackmoney movie success meet
ఈనెల 21న విడుదలైన తమ “బ్లాక్ మనీ” (అన్నీ కొత్త నోట్లే) చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తోందని, ఉభయ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 150 ధియేటర్స్ లో విడుదల చేశామని, అన్ని చోట్లా కలెక్షన్స్ బాగున్నాయని, ఈ వారం “బాహుబలి” తమదేనని అంటున్నారు “మ్యాజిన్ మూవీ మేకర్స్ అధినేత, చిత్ర నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్.
మలయాళంలో ఘన విజయం సాధించిన “రన్ బేబీ రన్”కి తెలుగు అనువాదంగా రూపొందిన “బ్లాక్ మనీ” చిత్రంలో మోహన్ లాల్, అమలాపాల్ మీడియా ప్రతినిధులుగా నటించారు. జోషి దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధించే దిశగా ముందుకు సాగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సంస్థ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన సయ్యద్ నిజాముద్దీన్.. ఇంత మంచి విజయం అందిస్తున్న ప్రేక్షకులకు, ఈ చిత్రం విడుదలలో తనకు సహకరించిన ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయం ఇస్తున్న ప్రోత్సాహంతో తమ సంస్థ నుంచి మరిన్ని మంచి సినిమాలు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్రం ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చి ఆడియోను ఆవిష్కరించిన ప్రముఖ యువ కథానాయకి సోనీ చరిష్టా.. ఈ సక్సెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు.
“బ్లాక్ మనీ” సినిమా సాధిస్తున్న సక్సెస్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ త్వరలోనే స్ట్రెయిట్ సినిమా చేయాలని ఆమె అభిలషించారు!!

Have something to add? Share it in the comments

Your email address will not be published.